Abhishek Sharma : చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరం..అభిషేక్ శర్మ కింగ్ కోహ్లీని బీట్ చేస్తాడా..?

Abhishek Sharma : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు తరఫున ఆడుతున్న ఈ యువ సంచలనం.. ఇప్పుడు ఏకంగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ తొమ్మిదేళ్ల నాటి ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువలో ఉన్నాడు.

Abhishek Sharma : చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరం..అభిషేక్ శర్మ  కింగ్ కోహ్లీని బీట్ చేస్తాడా..?
Abhishek Sharma (3)

Updated on: Dec 13, 2025 | 6:52 PM

Abhishek Sharma : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు తరఫున ఆడుతున్న ఈ యువ సంచలనం.. ఇప్పుడు ఏకంగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ తొమ్మిదేళ్ల నాటి ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువలో ఉన్నాడు. ఈ సిరీస్‌లోని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తే, ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం అభిషేక్ ముందుంది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో ఆడుతున్న అభిషేక్ శర్మకు తొలి రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు దక్కినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ 17 పరుగుల చొప్పున మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. అయినప్పటికీ, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అతడు అదరగొడితే, విరాట్ కోహ్లీ 2016లో నెలకొల్పిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ 2016 క్యాలెండర్ సంవత్సరంలో అద్భుత ఫామ్‌తో చెలరేగిపోయాడు. ఆ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 1,614 పరుగులు సాధించి.. ఒక సంవత్సరంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత ఆటగాడిగా అప్పటికే రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.

తాజా క్యాలెండర్ సంవత్సరం (2025)లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు 39 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ ఓపెనర్ 1,533 పరుగులు సాధించాడు. ఇప్పటికే అతడు 2022లో సూర్యకుమార్ యాదవ్ (1503 పరుగులు) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఇప్పుడు అభిషేక్ దృష్టి మొత్తం విరాట్ కోహ్లీ రికార్డు మీదే ఉంది. కోహ్లీ రికార్డును అధిగమించాలంటే అభిషేక్ శర్మకు ఇంకా కేవలం 82 పరుగులు మాత్రమే అవసరం. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు ఉండగా, ఈ యువ బ్యాటర్ ఈ రికార్డును ఖచ్చితంగా బద్దలు కొట్టగలడని అభిమానులు ఆశిస్తున్నారు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మూడో టీ20 మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలో జరగనుంది. ధర్మశాల మైదానంలో బౌండరీలు చిన్నగా ఉండటం, అలాగే తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు కూడా 187గా ఉండటం వల్ల బ్యాటర్లకు ఈ పిచ్ బాగా అనుకూలిస్తుంది. కాబట్టి, అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో మంచి స్కోరు చేసి రికార్డుకు చేరువయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ సిరీస్‌కు కీలక మలుపుగా మారనుంది. అలాగే అభిషేక్ రికార్డుపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒక సంవత్సరంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారతీయ బ్యాటర్లు

విరాట్ కోహ్లీ – 1614 పరుగులు (2016)

అభిషేక్ శర్మ – 1533 పరుగులు (2025)

సూర్యకుమార్ యాదవ్ – 1503 పరుగులు (2022)