వన్డే సిరీస్ టీమిండియా చేజారింది. రెండో వన్డేలో రోహిత్ సేన 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బంగ్లాదేశ్ చివరి వన్డే మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. అదే సమయంలో ఈ ఓటమి తర్వాత టీమిండియాకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ పర్యటనకు దూరమయ్యాడు. అంటే రోహిత్ చివరి వన్డేకు అందుబాటులో ఉండకపోగా.. టెస్ట్ సిరీస్ ఆడటంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు అతడి స్థానంలో ఓ యువ ఆటగాడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్-ఎపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన ఈ యువ బ్యాట్స్‌మెన్ మరెవరో కాదు అభిమన్యు ఈశ్వరన్.
పీటీఐ కథనం ప్రకారం, రోహిత్ శర్మ స్థానంలో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రావడం దాదాపుగా ఖరారైంది. ఈ ఆటగాడు బంగ్లాదేశ్-ఎతో జరిగిన 2-మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఈశ్వరన్ సెంచరీలు బాదేశాడు. తొలి మ్యాచ్‌లో 141 పరుగులు చేసిన అభిమన్యు.. రెండో మ్యాచ్‌లో 157 పరుగులు కొట్టాడు. కాగా, అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ఆటగాడు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్-ఎపై రెండు సెంచరీలతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో సర్వీసెస్‌పై సెంచరీ, అంతకుముందు రైల్వేస్‌పై హాఫ్ సెంచరీ చేశాడు. ఈశ్వరన్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 498 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో బెంగాల్ ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ కూడా ఆడే అవకాశం ఉంది. గాయం కారణంగా మహ్మద్ షమీ టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో.. అతడి స్థానంలో ముఖేష్ కుమార్ లేదా ఉమ్రాన్ మాలిక్ టెస్ట్ జట్టులో అవకాశం పొందవచ్చు. లేదా ఇద్దరూ కూడా తుది జట్టులో ఆడవచ్చు.
India A continue their domination on Day 2 with openers Yashasvi Jaiswal (145) and captain Abhimanyu Easwaran (142) putting on a massive 283-run stand. At Stumps, India A are 404-5 and lead by 292 runs.
Details – https://t.co/gtiu6wGotM pic.twitter.com/oDjmtNQbVt
— BCCI (@BCCI) November 30, 2022
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..