Virat Kohli: కోహ్లీ విషయంలో నేను తప్పు చేశాను.. ఆ సమాచారం తప్పు: ఏబీడీ కీలక ప్రకటన

Ab De Villiers: సుమారు 5 రోజుల క్రితం, విరాట్ కోహ్లీ రెండవసారి తండ్రి కాబోతున్నాడని, దాని కారణంగా అతను క్రికెట్‌కు విరామం ఇచ్చినట్లు ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలను చూపుతూ తన పేరును ఉపసంహరించుకున్నాడు. అయితే, కోహ్లి ఎందుకు వైదొలిగాడో బీసీసీఐ వెల్లడించలేదు.

Virat Kohli: కోహ్లీ విషయంలో నేను తప్పు చేశాను.. ఆ సమాచారం తప్పు: ఏబీడీ కీలక ప్రకటన
Virat Kohli Abd

Updated on: Feb 09, 2024 | 12:07 PM

Ab De Villiers On Virat Kohli Privacy: విరాట్ కోహ్లీకి సంబంధించి ప్రస్తుతం చర్చలు తీవ్రంగా మారాయి. భారత బ్యాట్స్‌మెన్ స్పెషల్ స్నేహితుడు ఏబీ డివిలియర్స్ విరాట్ తండ్రి కాబోతున్నాడని, దాని కారణంగా అతను ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడటం లేదని ఓ వీడియోలో వెల్లడించాడు. అయితే, ఇప్పుడు డివిలియర్స్ మరో వీడియో పోస్ట్ చేశాడు. తాను పెద్ద తప్పు చేశానని, కోహ్లీ తండ్రి అయ్యాడనే వార్తలు అబద్ధమని తెలిపాడు.

సుమారు 5 రోజుల క్రితం, విరాట్ కోహ్లీ రెండవసారి తండ్రి కాబోతున్నాడని, దాని కారణంగా అతను క్రికెట్‌కు విరామం ఇచ్చినట్లు ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలను చూపుతూ తన పేరును ఉపసంహరించుకున్నాడు. అయితే, కోహ్లి ఎందుకు వైదొలిగాడో బీసీసీఐ వెల్లడించలేదు.

కోహ్లీ గురించి అభిమానులు తమ సొంత అంచనాలు వేస్తూ, సోషల్ మీడియాలో కథనాలు పంచుకుంటున్నారు. ఇందుకుద డివిలియర్స్ కోహ్లీ మళ్లీ తండ్రి అయ్యాడనే ఫ్లేవర్‌ను జోడించాడు. అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ తన తప్పును గ్రహించాడు.

‘దైనిక్ భాస్కర్’తో మాట్లాడిన ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ గోప్యత గురించి, “క్రికెట్ కంటే కుటుంబం గొప్పది. నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో పెద్ద తప్పు చేశాను. ఆ సమాచారం తప్పు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టులకు కోహ్లీ దూరం కావచ్చు..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి రెండు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చివరి మూడు టెస్టులకు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే, మిగిలిన మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లి దూరంగా ఉండవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..