Video: ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు.. రాత్రికి రాత్రే మారిన అభిమాని లక్

|

Jan 11, 2025 | 9:00 AM

SA20 Match: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ SA20 మూడో సీజన్‌ ప్రారంభం అయింది. ఈ సీజన్‌లోని రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన ఓ అభిమానిని ఏకంగా కోటీశ్వరుడిగా మారాడు. ఇందులో కేన్ విలియమ్సన్ సహకారం కూడా ఉంది. ఈ అభిమానికి డబ్బు ఎందుకు, ఎలా వచ్చిందో ఓసారి చూద్దాం..

Video: ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు.. రాత్రికి రాత్రే మారిన అభిమాని లక్
A Fan Wins 2 Million Rand
Follow us on

DSG vs PC: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ SA20 ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది స్టార్ ఆటగాళ్ళు తమ ప్రతిభను చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌ల మాదిరిగానే ఇందులో ఆడే క్రికెటర్లు కూడా భారీ ఫీజులు తీసుకుని ఈ టోర్నీలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడు, అది టీ20 లీగ్ అయినా లేదా అంతర్జాతీయ క్రికెట్ అయినా, సాధారణంగా మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు మాత్రమే సంపాదిస్తుంటారు. కొంతమందికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మరికొంతమంది మంచి క్యాచ్‌లు పట్టినందుకు డబ్బులు అందుకుంటుంటారు. కానీ, SA20లో, ప్రేక్షకులు కూడా ఆనందిస్తున్నారు. ఎందుకంటే, వారికి కూడా డబ్బు దక్కుతుంది. తాజాగా ఓ ప్రేక్షకుడిపై కాసుల వర్షం కురిసింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ కెన్ విలియమ్సన్ ఈ అవార్డుకు కారణమయ్యాడు. అసలేం జరిగిందో ఓసారి చూద్దాం..

SA20 మూడవ సీజన్ జనవరి 9 గురువారం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం టోర్నీలో రెండో మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగింది. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. సూపర్ జెయింట్స్ కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. అయితే, విలియమ్సన్ తన జట్టుకు సహాయం చేయడమే కాకుండా, మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానిని కూడా ఊహించని విధంగా సహాయం చేశాడు.

ఇవి కూడా చదవండి

విలియమ్సన్ సిక్సర్, అభిమాని క్యాచ్..

ఇన్నింగ్స్ 17వ ఓవర్ మూడో బంతికి కేన్ విలియమ్సన్ స్లాగ్ స్వీప్ ఆడి గాలిలో భారీ షాట్ కొట్టాడు. బంతి నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ బయటకు వెళ్లింది. ఇక్కడ అద్భుతం కనిపించింది. ప్రతి స్టేడియం లాగానే ఇక్కడ కూడా సీట్లలో కూర్చున్న ప్రేక్షకులు బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. వారిలో ఒకరు విజయం సాధించారు. ఈ వ్యక్తి అద్భుతమైన స్టైల్‌లో ఈ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

క్యాచ్‌తో కోటీశ్వరుడు..

క్యాచ్ పట్టిన వెంటనే అతని ఆనందానికి అవధులు లేవు. అతని చుట్టూ ఉన్న మిగిలిన ప్రేక్షకులు కూడా ఆనందంలో చేరి అతన్ని అభినందించడం ప్రారంభించారు. ఎందుకంటే, ఇది మామూలు క్యాచ్ కాదు. ఈ క్యాచ్ అతన్ని కోటీశ్వరుని చేసింది. నిజానికి అభిమానులను ఆకర్షించేందుకు SA20 లీగ్ స్టేడియంలో క్యాచ్ తీసుకుంటే 2 మిలియన్ ర్యాండ్ అంటే దాదాపు రూ. 90 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ వ్యక్తికి 2 మిలియన్ ర్యాండ్ రివార్డ్ కూడా లభిస్తుంది. ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్ మాత్రమే. ఈ అవార్డును గెలుచుకున్న రెండవ వ్యక్తిగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..