Rishabh Pant: ఏంటీ.. పంత్‌ పల్టీ సెలబ్రేషన్స్‌ వెనుక ఇంత అర్థం ఉందా? అదేంటో తెలిస్తే ఎవరైనా వావ్‌ అనాల్సిందే..

ఐపీఎల్ 2025 లీగ్ దశ ముగింపులో రిషభ్ పంత్ 118 పరుగుల సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని సెలబ్రేషన్‌లో చేసిన బ్యాక్ ఫ్లిప్ చర్చనీయాంశమైంది. ఈ సీజన్‌లో విమర్శలను ఎదుర్కొన్న పంత్, తన ప్రతిభతో సమాధానం చెప్పాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఈ ఫామ్ చాలా ముఖ్యం.

Rishabh Pant: ఏంటీ.. పంత్‌ పల్టీ సెలబ్రేషన్స్‌ వెనుక ఇంత అర్థం ఉందా? అదేంటో తెలిస్తే ఎవరైనా వావ్‌ అనాల్సిందే..
Rishabh Pant

Updated on: May 28, 2025 | 10:14 AM

ఐపీఎల్‌ 2025లో లీగ్‌ దశ ముగిసింది. మంగళవారం లక్నో సూపర్‌ జెయింగ్స్‌, ఆర్సీబీ మధ్య జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ చూసి రిషభ్‌ పంత్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకోని ఉంటారు. అదేంటి ఎల్‌ఎస్‌జీ ఓడిపోయిందిగా వాళ్లేందుకు హ్యాపీగా ఉంటారని అనుకోవచ్చు. అయితే.. ఈ ఓటమితో ఎల్‌ఎస్‌జీకి వచ్చేదేమీ లేదు పోయేదేమీ లేదు. ఇది వాళ్లకు ఒక నామమాత్రపు మ్యాచే. వాళ్లు ఈ మ్యాచ్‌ కంటే ముందే ప్లే ఆఫ్స్‌కు దూరం అయ్యారు. సో.. ఆర్సీబీతో మ్యాచ్‌ వాళ్లకు అంత ఇంపార్టెంట్‌ కాదు. కానీ, ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ తన విశ్వరూపం చూపించాడు. ఈ సీజన్‌లో కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ చేసి.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడు పంత్‌. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 27 కోట్ల భారీ ధర పలికిన పంత్‌ ఆ రేంజ్‌లో ఆడట్లేదని అంతా తిట్టిపోశారు.

కానీ, ఎట్టకేలకు పంత్‌ అంటే ఏంటో ఓ సారి అలా చూపించి వెళ్లాడు. ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంత్‌ ఆడిన ఇన్నింగ్స్‌ చూసి.. కేవలం పంత్‌ అభిమానులే కాదు టీమిండియా ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ హ్యాపీ. ఎందుకంటే.. ఐపీఎల్‌ తర్వాత పంత్‌ ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌ కంటే ముందు పంత్‌ ఫామ్‌లోకి రావడంతో అంత హ్యాపీ. అయితే సెంచరీ చేసిన తర్వాత పంత్‌ చేసుకున్న పల్టీ సెలబ్రేషన్స్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారింది. గతంలో ఎప్పుడూ కూడా పంత్‌ ఇలాంటి సెలబ్రేషన్‌ చేసుకోలేదు. కానీ, ఈ సారి చాలా స్పెషల్‌గా కనిపించాడు.

సెంచరీ పూర్తి చేసి.. హెల్మెట్‌, గ్లౌజులు తీసేసి.. పల్టీ కొట్టి తన సంతోషం వ్యక్తం చేసుకున్నాడు. ఈ సెంచరీతో పెద్ద బండను నెత్తిపై నుంచి దించేసినట్లు ఉండి ఉంటుంది పంత్‌కు. అయితే.. ఈ స్పెషల్‌ సెలబ్రేషన్‌కు అంతకంటే స్పెషల్‌ అర్థం ఉన్నట్లు తెలుస్తుంది. అదేంటంటే.. కొన్నేళ్ల క్రితం పంత్‌ ఒక పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే, అప్పటి నుంచి పంత్‌ గతంలో ఆడినట్లు ఆడటం లేదు, తాజాగా ఈ సీజన్లో ఎన్నో అంచనాల మధ్య ఎల్‌ఎస్‌జీ కెప్టెన్సీ పగ్గాలు అందుకొని విఫలం అయ్యాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలిక ఆటగాడు.. ఇలాగేనా ఆడేది అంటూ విమర్శలు మూటగట్టుకున్నాడు.

ఈ విమర్శలకు పంత్‌ నోటితో కాకుండా తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అందుకే పల్టీ కొట్టి.. కొన్ని సార్లు జీవితం, అంచనాలు తలకిందులైనా కూడా.. నేను లేచి మళ్లీ అంతే స్ట్రాంగ్‌గా నిల్చుంటాను అని పంత్‌ తన పల్టీ సెలబ్రేషన్స్‌తో చెప్పకనే చెప్పాడని క్రికెట్‌ ఫ్యాన్స్ అంటున్నారు. ఆటలో ఎత్తు పల్లాలు కామన్‌.. ఇదే పంత్‌ సింబాలిక్‌గా చెప్పాడంతే. మ్యాచ్‌ తర్వాత పంత్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేస్తూ.. “ఆటుపోట్లతో కూడిన సీజన్. ఎంతో నేర్చుకొని ఇంటికి వెళ్తున్నాం. ఎల్‌ఎస్‌జీ ఫ్యామిలీ అందించిన సపోర్ట్‌, ప్రేమకు ధన్యవాదాలు. త్వరలో కలుద్దాం.” అంటూ పేర్కొన్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..