
IPL 2023 Mini Auction: ఐపీఎల్ 2023 (IPL Auction) వేలానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 23న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వేలం ప్రారంభం కానుంది. ఈసారి వేలంలో 405 మంది ఆటగాళ్లను వేలం వేయగా, అందులో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వేలానికి సంబంధించిన 10 కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. మొత్తం 991 మంది ఆటగాళ్లు వేలం కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 714 మంది భారతీయులు కాగా, 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
2. 991 మంది ఆటగాళ్లలో, 10 ఫ్రాంఛైజీ జట్లు వేలం కోసం 369 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. దీంతో పాటు మరో 36 మంది ఆటగాళ్లను కూడా వేలంలో చేర్చాలని ఫ్రాంచైజీలు కోరాయి. దీంతో మొత్తం 405 మంది ఆటగాళ్లను వేలం జాబితాలో చేర్చారు.
3. 405 మంది ఆటగాళ్లలో 273 మంది భారతీయులు, 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో, నలుగురు అసోసియేట్ దేశాలకు చెందినవారు ఉన్నారు.
4. ఈ 405 మంది ఆటగాళ్లలో మొత్తం 119 మంది ఆటగాళ్లకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. మిగిలిన 282 మంది ఆటగాళ్లు అన్‌క్యాప్ లిస్టులో ఉన్నారు.
5. 10 ఫ్రాంచైజీ జట్లలో మొత్తం 87 మంది ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. వీరిలో 30 మంది ఆటగాళ్లు విదేశీయులు కావచ్చు.
6. 19 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఈ ఆటగాళ్లంతా విదేశీయులే.
7. రూ. 1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో 11 మంది ఆటగాళ్లు సెగ్మెంట్‌లో ఉన్నారు. వీరు కాకుండా 20 మంది ఆటగాళ్ల బేస్ ధర కోటిగా పేర్కొన్నారు.
8. 10 ఫ్రాంచైజీ జట్లు వేలం కోసం మొత్తం రూ. 206.5 కోట్లు కలిగి ఉన్నాయి. అత్యధిక డబ్బు సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 42.25 కోట్లు) వద్ద ఉంది.
9. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలం పర్స్‌లో అతి తక్కువ మొత్తం (రూ. 7.05 కోట్లు) కలిగి ఉండగా, వారికి 11 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
10. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అతి తక్కువ సంఖ్యలో స్లాట్‌లు (5) ఖాళీగా ఉన్నాయి. అయితే వారి పర్స్‌లో మొత్తం రూ.19.45 కోట్లు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..