ఐపీఎల్ 15వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన ఏమాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు. కేవలం ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ తరుణంలో మినీ వేలానికి ముందుగా సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి ఆటగాళ్లతో పాటు మొత్తం 12 మందిని విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ ఫ్రాంచైజీ పర్స్‌లో రూ. 42.25 కోట్లు ఉన్నాయి. అలాగే ఆక్షన్‌లో మంచి ప్లేయర్స్‌పై ఫోకస్ పెట్టింది ఎస్‌ఆర్‌హెచ్. ఈ తరుణంలో ముగ్గురి ఆటగాళ్లను ఎన్ని కాసులైనా ఫర్వాలేదు.. కచ్చితంగా దక్కించుకోవాలని ఆశిస్తోందట. మరి వారెవరో తెలుసుకుందాం.
రిలీ రోసోవ్.. ఆరు సంవత్సరాల తర్వాత 2022లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల టీ20 బ్లాస్ట్‌లో 192.28 స్ట్రైక్ రేట్‌తో 16 ఇన్నింగ్స్‌లలో 623 పరుగులు చేసిన అనంతరం రోసోవ్‌కు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఛాన్స్ వచ్చీ రాగానే తానేంటో నిరూపించుకున్నాడు. 10 T20I ఇన్నింగ్స్‌లలో 46.50 సగటుతో 372 పరుగులు చేశాడు. ఈ తరుణంలో రోసోవ్ IPL 2023 మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు ఇతడిపై ఫోకస్ పెట్టింది. రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ ఓపెనర్‌లుగా బరిలోకి దిగితే.. ఐడెన్ మార్క్‌రామ్‌తో కలిసి రోసోవ్ మిడిల్ ఆర్డర్ చక్కదిద్దగలడని భావిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మాత్రమే. దీంతో ఆ ఫ్రాంచైజీ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలోనే మురుగన్ అశ్విన్ వారికి ఫస్ట్ టార్గెట్. ఈ టీ20 లీగ్‌లో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 42 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 7.87 ఎకానమీతో 35 వికెట్లు సాధించాడు.
2021 తర్వాత స్టోక్స్ మళ్లీ IPLకి తిరిగి వస్తున్నాడు. ఈ 31 ఏళ్ల ఇంగ్లీష్ బ్యాటర్ ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 43 మ్యాచ్‌లు ఆడి.. రెండు సెంచరీలతో 943 పరుగులు చేయడంతో పాటు, 28 వికెట్లు పడగొట్టాడు. ఇక కెప్టెన్‌గా, అటు బ్యాట్స్‌మెన్‌గా స్టోక్స్‌ను టార్గెట్ చేసింది సన్‌రైజర్స్. ఎక్కువ మొత్తం ఉండటంతో వారి ఎంపికలో ఇతడే మొదటి ఆప్షన్.