టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించారు.. కట్‌చేస్తే.. 24 ఫోర్లు, 24 సిక్సర్లు.. 317 పరుగులతో సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఇప్పటికే చాలా దేశాలు తమ తుది జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు కూడా ఖరారైంది. అయితే, ఈసారి దక్షిణాఫ్రికా జట్టులో ఖచ్చితంగా చోటు దక్కుతుందని భావించిన ఒక కీలక ఆటగాడికి మొండిచేయి ఎదురైంది. జట్టులో చోటు దక్కలేదన్న కోపాన్ని ఆ ఆటగాడు ఇప్పుడు మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తూ బౌలర్లపై తీర్చుకుంటున్నాడు.

టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించారు.. కట్‌చేస్తే.. 24 ఫోర్లు, 24 సిక్సర్లు.. 317 పరుగులతో సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్
Ryan Rickelton

Updated on: Jan 11, 2026 | 6:02 PM

SA20, Ryan Rickelton: ఒక ఆటగాడు నిలకడగా రాణిస్తున్నప్పటికీ జట్టులో చోటు దక్కకపోతే అది ఎంతో నిరాశను కలిగిస్తుంది. కానీ, నిజమైన పోరాటయోధుడు ఆ నిరాశను తన కష్టంతో జయించి, సెలెక్టర్లకు తన బ్యాట్ ద్వారానే సమాధానం చెబుతాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు చెందిన ఒక ఆటగాడు సరిగ్గా ఇదే పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి అతను ఓపెనింగ్ స్థానానికి బలమైన పోటీదారుడు. తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నాడు. జట్టు నుంచి తప్పించిన తర్వాత, అతను దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు, ఎడమచేతి వాటం తుఫాన్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్.

ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ SA20 ప్రస్తుత సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు అద్భుతమైన సెంచరీలు బాదాడు. ప్రస్తుతం అత్యధిక పరుగులు, అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే, వరల్డ్ కప్ జట్టు నుంచి తనను తప్పించిన కోపాన్ని బౌలర్లపై చూపిస్తూ సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇస్తున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ర్యాన్ రికెల్టన్ సరికొత్త చరిత్ర..

ర్యాన్ రికెల్టన్ రెండు సెంచరీలు బాదడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. SA20 చరిత్రలో రెండు సెంచరీలు బాదిన మొదటి బ్యాటర్‌గా అతను నిలిచాడు. విశేషం ఏమిటంటే ఈ రెండు సెంచరీలు ప్రస్తుత సీజన్‌లోనే వచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 24 ఫోర్లు, 24 సిక్సర్ల సహాయంతో ఏకంగా 317 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆయనే ఈ సీజన్‌లో టాప్ రన్ స్కోరర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..