INDIA VS ENGLAND: ఇంగ్లాండ్‌ను తిప్పేద్దాం… ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్న టీమిండియా…

ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న టీమిండియా ఇంగ్లండ్‌తో సుదీర్ఘ స్వదేశీ సిరీస్‌కు సిద్ధం అవుతోంది. కంగారులను...

INDIA VS ENGLAND: ఇంగ్లాండ్‌ను తిప్పేద్దాం... ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్న టీమిండియా...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 03, 2021 | 4:33 PM

ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న టీమిండియా ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ స్వదేశీ సిరీస్‌కు సిద్ధం అవుతోంది. కంగారులను ఫేస్ దళంతో హడలెత్తించిన భారత జట్టు… ఇంగ్లీష్ ఆటగాళ్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇంగ్లాండ్‌తో భారత్ మొదటి టెస్టు చెపాక్ స్టేడియం శుక్రవారం ఆడనుంది. ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి.

ముగ్గురు స్పిన్నర్లతో…

కంగారులను ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌తో హడలెత్తించిన టీమిండియా ఇంగ్లీష్ ఆటగాళ్లను స్పిన్‌తో చుట్టేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగా ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. కాగా చెపాక్ పిచ్ మొదటి రోజు ఫేస్‌కు రెండో, మూడో రోజుల్లో బ్యాటింగ్‌కు, చివరి రెండు రోజుల్లో స్పిన్‌కు అనకూలించే అవకాశాలుండడంతో భారత్ ఈ నిర్ణయానికి వచ్చింది.

ఆ స్పిన్ త్రయం వీరే…

ఆసీస్ సిరీస్‌లో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లకు ఇంగ్లాండ్తో ఆడే ఫస్ట్ టెస్టు ఫైనల్ జట్టులో ఉన్నారు. ఇక మరో స్పిన్నర్ స్థానం కోసం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మధ్య పోటీ నెలకొంది. అయితే ఆసీస్ సిరీస్‌లో బ్యాటింగ్‌తోనూ అదరగొట్టిన సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని క్రికెట్ పండితులు తెలుపుతున్నారు. కాగా, లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్‌ను తీసుకునే అవకాశాలున్నాయని… ఆ కోణంలో చూస్తే అక్షర్‌కు అవకాశం లభించవచ్చని విశ్లేషకులు తెలుపుతున్నారు.

Also Read: Coronavirus Telangana: తెలంగాణలో కొత్త కరోనా కేసులు 185… మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?