
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా సంచలనం రేపాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ రాత్రిలోనే హీరోగా మారిన సూర్యవంశీ, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాలు 32 రోజులు) శతకం సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, అతను ఐపీఎల్‌లో రెండవ వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు, యూసుఫ్ పఠాన్ రికార్డును అధిగమించి తన ప్రతిభను చాటేశాడు. ఈ అసాధారణ విజయంతో అతను భారత క్రికెట్‌కు ఒక కొత్త ఆశాకిరణంగా మారాడు.
14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ప్రదర్శనతో ద్రవిడ్ విశ్వాసాన్ని నిలబెట్టాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో 101 పరుగులు చేసిన వైభవ్, ఒక్కసారిగా స్టేడియం మొత్తం ఉర్రూతలూగేలా చేశాడు. బౌండరీలు, సిక్సర్లు సముద్రంలా ఎగిసిపడటంతో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు, ఈలులతో స్టేడియాన్ని కంపింపజేశారు. 17 బంతుల్లోనే అరుదైన హాఫ్ సెంచరీని సాధించి, 35 బంతుల్లోనే తన ఐపీఎల్ తొలి శతకం కొట్టి పలు రికార్డులు కూడా నెలకొల్పాడు. వరుసగా 6,4,6,4,4,6లు కొట్టి ఒక ఓవర్‌లోనే 30 పరుగులు రాబట్టిన వైభవ్, చివరకు తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
వైభవ్ సూర్యవంశీ విజయాన్ని గుర్తించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అతనికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, వైభవ్‌ను అభినందించారు. “ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచిన బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. అతని కృషి, ప్రతిభ భారత క్రికెట్‌కు కొత్త కీర్తి తెచ్చిపెడుతాయని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే, గత సంవత్సరం అతనితో మరియు అతని తండ్రితో కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి, ఫోన్ ద్వారా కూడా వ్యక్తిగతంగా అభినందించానని తెలిపారు.
వైభవ్ సూర్యవంశీ అసాధారణ ఆటతీరు, అతని ప్రామిసింగ్ ఫార్మ్‌తో దేశవ్యాప్తంగా కోటానుకోట్లు మంది అభిమానులను ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ చిన్నారి ఆటగాడు, కేవలం తన వయసుతోనే కాదు, తన ఆటతీరు, ధైర్యంతోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. అతని ఈ డ్రీమ్ ఇన్నింగ్స్ అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతి అతని విజయాన్ని మరింత గౌరవించింది.
ఇదిలా ఉండగా, మే 1న జరిగే తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొనడానికి రాజస్థాన్ రాయల్స్ సిద్ధమవుతోంది. ఫామ్‌లో ఉన్న వైభవ్ మరోసారి తన అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేయనున్నాడా అనే ఆసక్తి క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది. భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించి దేశానికి గౌరవం తీసుకురావాలని ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు.
आई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX
— Nitish Kumar (@NitishKumar) April 29, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..