Cricket: 178 బంతుల్లో 508 పరుగులు.. 81 ఫోర్లు, 18 సిక్సులు.. సరికొత్త చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల కుర్రాడు..

Cricket Records: మూడేళ్ల క్రితం వరకు స్కేటింగ్‌లో సత్తా చాటేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అనుకున్నమేరకు రాష్ట్ర, జాతీయ టోర్నీల్లో రాణించాడు. అయితే స్కేటింగ్‌లో భవిష్యత్తు అంతగా లేకపోవడంతో కెరీర్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Cricket: 178 బంతుల్లో 508 పరుగులు.. 81 ఫోర్లు, 18 సిక్సులు.. సరికొత్త చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల కుర్రాడు..
Cricket

Updated on: Jan 14, 2023 | 11:31 AM

Cricket Records: మూడేళ్ల క్రితం వరకు స్కేటింగ్‌లో సత్తా చాటేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అనుకున్నమేరకు రాష్ట్ర, జాతీయ టోర్నీల్లో రాణించాడు. అయితే స్కేటింగ్‌లో భవిష్యత్తు అంతగా లేకపోవడంతో కెరీర్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ బాలుడికి తండ్రి కూడా తోడవ్వడంతో.. ఇక వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో కెరీర్ మారినా.. తన దూకుడు ఏమాత్రం తగ్గలేదు. యష్ 508 పరుగులు (178 బంతులు, 81×4, 18×6) అజేయంగా నిలిచి, తన సత్తా చాటాడు. దీంతో ఆయన జట్టు సరస్వతీ విద్యాలయం 40 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 714 పరుగులకు చేరుకుంది. ఆ బాలుడి పేరు యాష్ చావ్డే.. కుడిచేతి వాటం ఆటగాడు చావ్డే భారతదేశంలోని ఇంటర్-స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌లలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సృష్టించి, తన ప్రత్యేకతను చూపించాడు.

జులేలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్ జూనియర్ ఇంటర్ స్కూల్ (అండర్-14) క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో ఈ రికార్డు స్కోర్ సాధించని చావ్డే.. అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇంతటి భారీ స్కోర్‌ టార్గెట్‌గా బరిలోకి దిగిన సిద్ధేశ్వర్ విద్యాలయం జట్టు 5 ఓవర్లలో 9 పరుగుల వద్దే ఆగిపోయింది.

శ్రీలంక ఆటగాడు చిరత్ సెల్లెపెరుమా తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 500+ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా ఋ 13 ఏళ్ల చావ్డే నిలిచాడు. ఆగస్టు 2022లో శ్రీలంకలోని అనురాధపురలో జరిగిన అండర్-15 ఇంటర్-స్కూల్ టోర్నమెంట్‌లో సెల్లెపెరుమ 553 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ “రికార్డుల ప్రకారం, చావ్డే అన్ని ఫార్మాట్‌లు, ఏజ్ గ్రూప్‌లలో 500+ స్కోరు చేసిన 10వ బ్యాటర్‌గా నిలిచాడు. 10 మంది జాబితాలో ఐదుగురు భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో ప్రణవ్ ధనవాడే (1009*), ప్రియాంషు మోలియా ( 556*), పృథ్వీ షా (546), డాడీ హవేవాలా (515), యష్ చావ్డే (508*) ఉన్నారు” అని ఆయన అన్నారు.

178 బంతులు ఆడి 81 బౌండరీలు, 18 సిక్సర్లు బాదిన చావ్డే.. అతని భాగస్వామి తిలక్ వాకోడ్ (97 బంతుల్లో 127)తో కలిసి రికార్డు ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కుడిచేతి వాటం ఆటగాడు చావ్డే అండర్-16 VCA టోర్నమెంట్‌లో రెండు సెంచరీలతో ఈ సీజన్‌లో సరస్వతీ విద్యాలయ తరపున 1000 కంటే ఎక్కువ పరుగులు బాదేశాడు.

డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ స్పోర్ట్స్ అకాడమీ (DACSA)లో చందన్ సాహ్ ఆధ్వర్యంలో చావ్డే శిక్షణ పొందుతున్నాడు. అంతకుముందు, విదర్భలో, 2011లో అండర్-16 ఇంటర్-క్లబ్ టోర్నమెంట్‌లో పీయూష్ ఫుల్‌సుంగే 469 పరుగులు చేశాడు. ఫుల్‌సుంగే మరో విదర్భ బ్యాటర్ అలీ జోరెన్ ఖాన్ 461 పరుగులను అధిగమించాడు. ఇది 2010లో ఇంటర్-స్కూల్ మీట్‌లో కూడా నమోదైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..