2028 ఒలింపిక్స్ లో క్రికెట్    !  

ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను చేర్చాలని ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిర్ణయం దిశగా అడుగులు పడ్డాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు మెరిల్ బోన్ క్రికెట్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు ఎంసీసీ చైర్మన్ మైక్ […]

2028 ఒలింపిక్స్ లో క్రికెట్    !  

Updated on: Aug 13, 2019 | 12:53 PM

ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను చేర్చాలని ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిర్ణయం దిశగా అడుగులు పడ్డాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు మెరిల్ బోన్ క్రికెట్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు ఎంసీసీ చైర్మన్ మైక్ గాట్టింగ్. వచ్చే ఏడాదిన్నర కాలంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఒలింపిక్స్ కు ఎలా అర్హత పొందాలి అనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లుగా గాటింగ్ వెల్లడించారు. అయితే, ఈ గేమ్స్ నెలరోజుల పాటు కాకుండా రెండు వారాల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆసియా గేమ్స్ లోకి త్వరలోనే క్రికెట్ చేరబోతుందని తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.