ఇండియా సౌత్ ఆఫ్రికా తొలి వన్డేకి స్టేడియం ఖాళీ..?

| Edited By:

Mar 11, 2020 | 5:38 PM

మార్చి 12 నుండి దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో ధర్మశాల వేదికగా గురువారం జరగనున్న తొలి వన్డేకి స్టేడియం ఖాళీగా దర్శనమివ్వబోతోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్

ఇండియా సౌత్ ఆఫ్రికా తొలి వన్డేకి స్టేడియం ఖాళీ..?
Follow us on

మార్చి 12 నుండి దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో ధర్మశాల వేదికగా గురువారం జరగనున్న తొలి వన్డేకి స్టేడియం ఖాళీగా దర్శనమివ్వబోతోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. స్టేడియంలోకి వచ్చి మ్యాచ్‌ని చూసేందుకు ప్రేక్షకులు అనాసక్తిని కనబరుస్తున్నారు. ధర్మశాల స్టేడియం సీటింగ్ సామర్థ్యం 22,000కాగా.. ఇప్పటి వరకూ పావు వంతు టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) వెల్లడించింది.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ ఇప్పుడు భారత్‌లోనూ ప్రవేశించింది. ఇప్పటికే 60 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా.. వందల్లో అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ నేపథ్యంలో.. టీమిండియా మ్యాచ్‌ ఆడుతున్నప్పటికీ.. స్టేడియానికి వచ్చి వీక్షించేందుకు అభిమానులు సాహసించడం లేదు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి తొలి వన్డే మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు కూడా పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.

[svt-event date=”11/03/2020,5:34PM” class=”svt-cd-green” ]