Weightlifting: భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన జెరెమీ..

|

Jul 31, 2022 | 4:19 PM

Weightlifting: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మరోసారి సత్తా చాటింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. ఆదివారం జరిగిన వెయిట్‌ లిఫ్టింగ్‌ గేమ్‌లో జెరెమీ లాల్‌ రిన్నుంగ్‌ 67కేజీల మెన్స్ వెయిట్​లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు...

Weightlifting: భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన జెరెమీ..
Weightlifting
Follow us on

Weightlifting: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మరోసారి సత్తా చాటింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. ఆదివారం జరిగిన వెయిట్‌ లిఫ్టింగ్‌ గేమ్‌లో జెరెమీ లాల్‌ రిన్నుంగ్‌ 67కేజీల మెన్స్ వెయిట్​లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 19 ఏళ్ల వయసులోనే జెరెమీ ఈ ఘనత సాధించడం విశేషం. ఇదిలా ఉంటే జెరెమీ 300 కేజీల బరువు ఎత్తి కామన్​వెల్త్‌​లో కొత్త రికార్డు సృష్టించాడు. దీంతో మారాబాయి చాను తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుతం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

జెరెమీ 67 కేజీల విభాగంలో ఈ పతకాన్ని అందుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తిన లిఫ్టర్‌.. రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తం 300 కేజీలకుపైగా ఎత్తి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఇక జెరెమీ కెరీర్ విషయానికొస్తే.. 2018 యూత్ ఓలింపిక్స్‌లో 274 కేజీలను ఎత్తి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్న జెరెమీ, 16 ఏళ్ల వయసులో వెయిట్‌ లిఫ్టింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్స్‌లో పాల్గొన్నాడు. తాజాగా కామన్‌వెల్త్‌లో మరోసారి సత్తా చాటి, భారత్‌కి రెండో స్వర్ణాన్ని అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..