CWG 2022 Weightlifting: తృటిలో స్వర్ణం కోల్పోయిన సంకేత్ సర్గర్.. రజతంతో భారత్ ఖాతా తెరిచిన ఖేలో ఇండియా ఛాంపియన్..

వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గర్ భారత్‌కు రజతం అందించాడు.

CWG 2022 Weightlifting: తృటిలో స్వర్ణం కోల్పోయిన సంకేత్ సర్గర్.. రజతంతో భారత్ ఖాతా తెరిచిన ఖేలో ఇండియా ఛాంపియన్..
Sanket Sargar

Edited By: Basha Shek

Updated on: Jul 30, 2022 | 5:36 PM

శనివారం కామన్వెల్త్ గేమ్స్ 2022లో సంకేత్ సర్గర్ అద్భుతాలు చేశాడు. వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించి భారత్ ఖాతా తెరిచాడు. ఒక కిలో తేడాతో స్వర్ణం గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. సంకేత్ సర్గర్ మొత్తం 248 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 113 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 135 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో సంకేత్ సర్గర్ తొలి ప్రయత్నంలో 107 కిలోలు, రెండో ప్రయత్నంలో 111 కిలోలు ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 113 కేజీలు ఎత్తి తన ప్రదర్శనను మెరుగుపరుచుకున్నాడు. క్లీన్ ఎండర్ జెర్క్‌లో సాగర్ తొలి ప్రయత్నంలో 135 కిలోలు, రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తాడు. సంకేత్ సర్గర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020లో ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేకాదు తన పేరిట జాతీయ రికార్డు కూడా సాధించాడు.

సంకేత్ కేవలం 1 కేజీ తేడాతో స్వర్ణం కోల్పోయాడు. పురుషుల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మలేషియాకు చెందిన బిన్ కస్దాన్ మహ్మద్ అనిక్ స్వర్ణం సాధించాడు. స్నాచ్‌ అండ్‌ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొత్తం 249 కిలోలు ఎత్తాడు. రజతం అందుకున్న అనంతరం సంకేత్ మాట్లాడుతూ.. ‘‘నా రజత పతకాన్ని స్వాతంత్య్ర సమరయోధులకు అంకితం చేయాలనుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారికి నా పతకం అంకితం’ అంటూ చెప్పుకొచ్చాడు.

సంకేత్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ నేషనల్స్‌ను కూడా గెలుచుకున్నాడు. 55 కేజీల విభాగంలో బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో అతను అద్భుతంగా రాణించగలడని భారత క్రీడా సంఘం నిశ్చయించుకుంది. కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ విద్యార్థి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి రోజుకు 12 గంటలు సాధన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో బర్మింగ్‌హామ్ గేమ్‌ల రెండో రోజున ఫలితం పొందాడు.