CWG 2022: నేడు కామన్వెల్త్ గేమ్స్ అసలు సమరం షురూ.. ఆస్ట్రేలియాతో భారత మహిళ క్రికెట్ జట్టు ఢీ.. సరికొత్త జెర్సీతో కనులవిందు

|

Jul 29, 2022 | 9:18 AM

కామన్వెల్త్ గేమ్స్‌లోని అన్ని క్రికెట్ మ్యాచ్‌లు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతాయి. తొలి మ్యాచ్ భారత్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో మైదానంలోకి దిగే భారత జట్టు జెర్సీ రంగు, రూపం కొద్దిగా మారనున్నది

CWG 2022: నేడు కామన్వెల్త్ గేమ్స్ అసలు సమరం షురూ.. ఆస్ట్రేలియాతో భారత మహిళ క్రికెట్ జట్టు ఢీ.. సరికొత్త జెర్సీతో కనులవిందు
Cwg 2022 India Cricket
Follow us on

CWG 2022: అంగరంగ  వైభంగా కామన్వెల్త్ గేమ్స్  ప్రారంభమయ్యాయి. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్ లో మహిళల క్రికెట్‌ను తొలిసారిగా చేర్చారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సహా 8 జట్లు పోటీపడుతున్నాయి. తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఒక్క క్రీడాకారిణి పై ప్రతి దృష్టి ఉంటుంది. మరోవైపు భారత క్రీడా అభిమానులు భారత మహిళల క్రికెట్ జట్టుపై దృష్టి పెట్టడం సహజం. నేడు జరుగుతున్న  తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కనిపించనుంది. మ్యాచ్‌కి ముందు టీమిండియా ఏ విధంగా కనిపించనున్నదో తెలుసుకుందాం..

కామన్వెల్త్ గేమ్స్‌లోని అన్ని క్రికెట్ మ్యాచ్‌లు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతాయి. తొలి మ్యాచ్ భారత్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో మైదానంలోకి దిగే భారత జట్టు జెర్సీ రంగు, రూపం కొద్దిగా మారనున్నది. రంగు నీలం రంగులో ఉన్నప్పటికీ.. డ్రెస్ రూపకల్పన, చిత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇలా టీమిండియా జెర్సీలో మార్పులు ఎందుకో తెలుసా..!

ఇవి కూడా చదవండి

టీం ఇండియా జెర్సీ మార్పు 
వాస్తవానికి భారతీయ పురుషులు, మహిళలు క్రికెట్ జట్లు ప్రధానంగా BCCI ఒప్పందం ప్రకారం పని చేస్తారు. అందువలన ఆటగాళ్ల జెర్సీలు BCCI లోగోను కలిగి ఉంటాయి. అలాగే, ఆ ​​జెర్సీలపై బీసీసీఐ..  స్పాన్సర్ల పేర్లు, లోగోలు ఉంటాయి. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ (లేదా ఒలింపిక్ లేదా ఆసియా క్రీడలు) విషయంలో భారత క్రికెట్ జట్టు ధరించే జెర్సీలు భిన్నంగా ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే ఆటగాళ్లు తమ సమాఖ్య పేరుతో కాకుండా భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో మైదానంలో అడుగు పెడతారు. దీంతో భారత జట్టు ఎలాంటి జెర్సీని ధరించాలనే విషయంపై బీసీసీఐ చూచిన చెసింది. ఒక్క భారత క్రికెట్ జట్టుమాత్రమే కాదు.. ఇతర దేశాల క్రికెట్‌ జట్ల జెర్సీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఆటగాళ్లు , అభిమానులకు కొత్త అనుభవం
కొత్త జెర్సీలతో సరికొత్త లుక్ లో మైదానంలో భారతీయ కికెటర్లు అడుగుపెట్టే దృశ్యం పూర్తిగా కొత్తది. 1998లో క్రికెట్‌కు CWGలో స్థానం లభించినప్పటికీ.. అనంతరం క్రికెట్ ఏ బహుళ-క్రీడా ఈవెంట్‌లో భాగం కాలేదు. కనుక ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ లో కొత్త జెర్సీ అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అభిమానులకే కాదు, ఆటగాళ్లకు కూడా ఇది భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

,