తొలి వికెట్ తీసిన క్రికెట్ బాహుబలి

| Edited By:

Aug 31, 2019 | 4:38 PM

వెస్టిండీస్ భారీ కాయుడు రకీమ్ కార్న్‌వాల్ భారత్‌పై అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ వార్విక్ బరువు కంటే ఎక్కువగా ఉండి అతి బరువైన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. క్రికెట్ బాహుబలిగా అభివర్ణిస్తున్న ఇతను.. ఆరున్నర అడుగుల ఎత్తు, 140 కిలోల బరువు ఉన్న ఇతడు ఆఫ్ స్పిన్నర్. కమిన్స్ స్థానంలో అతడు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతే కాదు తొలి మ్యాచ్‌లో తన సత్తా కూడా చాటాడు. ఆఫ్ స్పిన్‌లో మంచి బౌన్స్ వేస్తూ బ్యాట్స్‌మెన్స్‌ను […]

తొలి వికెట్ తీసిన క్రికెట్ బాహుబలి
Follow us on

వెస్టిండీస్ భారీ కాయుడు రకీమ్ కార్న్‌వాల్ భారత్‌పై అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ వార్విక్ బరువు కంటే ఎక్కువగా ఉండి అతి బరువైన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. క్రికెట్ బాహుబలిగా అభివర్ణిస్తున్న ఇతను.. ఆరున్నర అడుగుల ఎత్తు, 140 కిలోల బరువు ఉన్న ఇతడు ఆఫ్ స్పిన్నర్. కమిన్స్ స్థానంలో అతడు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతే కాదు తొలి మ్యాచ్‌లో తన సత్తా కూడా చాటాడు. ఆఫ్ స్పిన్‌లో మంచి బౌన్స్ వేస్తూ బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బందులకు గురిచేశాడు. పుజారాను ఔట్ చేసి తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను చేజిక్కించుకున్నాడు. బౌన్స్ ఎక్కువ కావడంతో బంతిని కట్ చేసిన పుజారా.. డైరెక్ట్‌గా బ్రూక్స్ చేతికి చిక్కాడు. భారీ సిక్సులు కొడతాడన్న రికార్డు కార్న్‌వాల్ సొంతం. అయితే ఇటీవల జరిగిన దేశీవాళీ మ్యాచుల్లో రాణించాడు.

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి రోజు జరిగిన ఆటలో 27 ఓవర్లు వేసి 69 పరుగులు ఇచ్చాడు. పుజారా వికెట్ తీయడంతో క్రేజీగా ఉందని.. అన్నాడు. వికెట్లు తీయడం కొత్తేమీ కాదన్న ఆయన.. అంతర్జాతీయంగా తొలి వికెట్ దక్కించుకోవడం ఎంతో క్రేజీగా ఉందన్నాడు.