బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒక ‘మిక్కీమౌజ్ సెలక్షన్ కమిటీ’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్.. ఓ మ్యాచ్‌లు టీమిండియా సెలక్టర్లు అనుష్క శర్మకు టీ కప్పులు అందించారంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అనుష్క ఓ భావోద్వేగ ప్రకటనను ఇచ్చింది.
‘‘తప్పుడు, అనవసర వార్తలకు దూరంగా ఉంటాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. అలాగే 11 సంవత్సరాలుగా నా కెరీర్ సాగింది. కానీ కొందరు ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారు. అప్పటినుంచి ఆ అబద్ధం నిజంలా కనిపిస్తోంది. దాన్ని చూసి నాకు భయం వేస్తోంది. అందుకే నా నిశ్శబ్ధాన్ని ఇవాళ వీడుతున్నా.
అప్పటి నా బాయ్‌ఫ్రెండ్, ఇప్పుడు నా భర్త పర్‌ఫార్మెన్స్ విషయంలో నేను నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కొటూనే ఉన్నా. ఇప్పటికీ భారత క్రికెట్‌లో నేను ఇన్వాల్ అవుతున్నానంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. క్లోజ్ డోర్ టీమ్ మీటింగ్స్‌లోనూ, సెలక్షన్‌లోనూ నేను ఇన్వాల్వ్ అవుతున్నానని తప్పుడు వార్తలు వచ్చాయి. ఫారిన్ టూర్లకు వెళ్లినప్పుడు టీమిండియాతో పాటు నాకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని నా పేరును లాగారు. కానీ వెళ్లిన ప్రతిసారి నేను ప్రోటోకాల్‌ను బ్రేక్ చేయలేదు.టికెట్లు, సెక్యూరిటీ.. ఇలా ప్రతీది నాకు కల్పించేందుకు టీమిండియా బోర్డు ఇబ్బంది పడుతోందని నా పేరును లాగారు. కానీ నిజ జీవితంలో నా ఫ్లైట్ ఖర్చులను నేనే పెట్టుకుంటాను. నా టికెట్‌ను నేనే కొంటాను. హైకమిషనర్ భార్యతో టీమిండియా తీసుకున్న ఫొటో విషయంలోనూ నన్ను లాగారు. ఆ మీటింగ్‌కు నాకు కూడా ఇన్విటేషన్ వచ్చిందన్న విషయం తెలిసినా ఊరుకుండిపోయాను. ఇదే విషయంపై బోర్డు అధికారిక ప్రకటన ఇచ్చినా.. నాపై ఆరోపణలు ఆగలేదు. ఈ అన్నింటి విషయాల్లోనూ అబద్ధపు వార్తలే వచ్చాయి. కానీ ప్రతిసారి నేను సైలెంట్‌గా ఉంటూ వస్తున్నా. ఇక ఇప్పుడు కూడా నాపై మళ్లీ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో సెలక్టర్ల బాక్స్‌లో నేను ఉంటే.. నాకు సెలక్టర్లు టీ ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి అప్పుడు నేను ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చొన్నా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇండియన్ క్రికెట్‌కు సంబంధించి సెలక్షన్ కమిటీ మీద గానీ.. వారి నిర్ణయాల మీద గానీ ఏదైనా కామెంట్ వేయాలని అనిపిస్తే.. అది మీ ఇష్టం. అంతేగానీ మీ అనవసర వివాదాల్లోని నా పేరును లాగకండి. నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను లాగడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు.
వీటన్నింటిపై ఎప్పటినుంచో సైలెంట్‌గా ఉంటూ వస్తుంటే.. నా మీద అబద్ధపు ప్రచారాలు ఎక్కువవుతున్నాయి. అంతేకాదు ఎవరి నిశ్శబ్ధమైనా వారి బలహీనత అవ్వకూడదు. అందుకే ఎట్టకేలకు నా మౌనాన్ని వీడాల్సి వచ్చింది. ఇకపై ఎప్పుడైనా వేరే వారి విషయంలో గానీ, బోర్డు విషయంలో గానీ, నా భార్త విషయంలో గానీ నా పేరును ఉపయోగించే ముందు.. ఆధారాలతో సహా మాట్లాడండి. నా జీవితాన్ని నేను ఎంతో తీర్చిదిద్దుకున్నా. క్రమశిక్షణతో నా కెరీర్‌ను మలుచుకున్నా. కానీ ఇలాంటి ఆరోపణలను మాత్రం నేను అస్సలు సహించలేను. అయినా ఇదంతా నమ్మేందుకు కొంతమందికి కష్టంగా అనిపించొచ్చు. ఎందుకంటే.. నేను ఓ క్రికెటర్‌కు భార్యగా ఉన్నప్పటికీ.. ఓ ఇండిపెండెంట్ మహిళను. ఇంకో విషయం రికార్డుల ప్రకారం నేను తాగింది కాఫీ అని ఓ స్పష్టతను ఇచ్చింది.
సారీ చెప్పిన ఫరూఖ్ ఇంజినీర్
కాగా అనుష్క ట్వీట్ తరువాత.. ఈ వివాదంలో ఆమెకు సారీ చెప్పాడు ఫరూఖ్. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తన కామెంట్లు ఇండియన్ సెలక్టర్లను ఉద్దేశించినవని.. అనుష్కను కాదని పేర్కొన్నాడు. అంతేకాదు అనుష్క చాలా మంచి అమ్మాయని.. కోహ్లీ బ్రిలియంట్ కెప్టెన్ అని.. రవిశాస్త్రి అద్భుత కోచ్ అని ఆయన కితాబిచ్చారు. అనవసరంగా ఈ వివాదం పెద్దదైందని పరూఖ్ చెప్పుకొచ్చాడు.
https://twitter.com/AnushkaSharma?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor