CWG 2022: కామన్వెల్త్‌ పోటీల్లో చరిత్ర సృష్టించిన భవినా పటేల్‌.. పారా టెబుల్ టెన్నిస్‌లో గోల్డ్‌ మెడల్‌ కైవసం..

|

Aug 07, 2022 | 8:42 AM

భారత స్టార్ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల భవినా..

CWG 2022: కామన్వెల్త్‌ పోటీల్లో చరిత్ర సృష్టించిన భవినా పటేల్‌.. పారా టెబుల్ టెన్నిస్‌లో గోల్డ్‌ మెడల్‌ కైవసం..
Bhavina Patel
Follow us on

Bhavina Patel wins gold: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. తాజాగా.. భారత పారా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినా పటేల్‌ చరిత్ర సృష్టించింది. రెజ్లింగ్ విభాగంలో రెజ్లర్ల స్వర్ణ ప్రదర్శన తర్వాత.. భారత స్టార్ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల భవినా.. పారా టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్ లో 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో గెలుపొందింది. దీంతో టెబుల్ టెన్నిస్ విభాగంలో భారత తరఫున గోల్డ్‌ సాధించిన మొదటి క్రీడాకారిణిగా భవినా పటేల్ రికార్డులకెక్కింది. పోటీల్లో అంతకముందు మరో పారా టీటీ ప్లేయర్‌ సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో కామన్వెల్త్‌లో భారత పతకాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 13 స్వర్ణాలు ఉండగా.. 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి.

కాగా.. పారా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినా పటేల్‌.. ఏడాది క్రితం ఆగస్టులో టోక్యో పారాలింపిక్స్‌లో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించి దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి