అందుకే రోహిత్‌ శర్మ సహచరులతో ఆస్ట్రేలియాకు వెళ్లలేదు.. అసలు కారణం వెల్లడించిన బీసీసీఐ

| Edited By:

Nov 28, 2020 | 8:16 AM

ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా తన సహచరులతో కలిసి రోహిత్ శర్మ అక్కడకు వెళ్లకపోవడంపై పలు వార్తలు వచ్చాయి. దానికి తోడు రోహిత్‌ గాయం గురించి తనకు పూర్తి సమాచారం లేదని కోహ్లీ చెప్పడంతో

అందుకే రోహిత్‌ శర్మ సహచరులతో ఆస్ట్రేలియాకు వెళ్లలేదు.. అసలు కారణం వెల్లడించిన బీసీసీఐ
Follow us on

Rohit Sharma Australia: ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా తన సహచరులతో కలిసి రోహిత్ శర్మ అక్కడకు వెళ్లకపోవడంపై పలు వార్తలు వచ్చాయి. దానికి తోడు రోహిత్‌ గాయం గురించి తనకు పూర్తి సమాచారం లేదని కోహ్లీ చెప్పడంతో.. అసలు టీమిండియాలో ఏం జరుగుతుందన్న ప్రశ్నలు తలెత్తాయి. మాజీ పేసర్ ఆశిస్ నెహ్రా సైతం కోహ్లీ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి బీసీసీఐ అధికారి వివరణ ఇచ్చారు.

రోహిత్‌ తండ్రి కరోనా బారిన పడటంతో.. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా వెళ్లకుండా అతడు భారత్‌కి తిరిగి వచ్చాడని బీసీసీఐ అధికారి తెలిపారు. అలాగే రోహిత్ తండ్రి హార్ట్ పేషెంట్ అని, ఈ విషయం కోహ్లీకి తెలీదని వివరించారు. ఇప్పుడు రోహిత్‌ తండ్రి కోలుకున్నారని, ఎన్‌సీఏకు వెళ్లి రోహిత్‌ తన రీహాబిలిటేషన్‌ని ప్రారంభిస్తారని ఆయన వివరించారు. ఇక డిసెంబర్‌ 11న రోహిత్‌ ఫిట్‌నెస్‌ని మరోసారి సమీక్షిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు గాయంతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాంత్‌ శర్మ.. మిగిలిన రెండు టెస్టుల నుంచి కూడా తప్పుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇషాంత్‌ పక్కటెముకల గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా…టెస్టు మ్యాచ్‌లు ఆడే ఫిట్‌నెస్‌ స్థాయిని అతడు అందుకోలేదని బోర్డు వెల్లడించింది.