AUS vs AFG, T20 WC: ఆప్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా విజయం.. సెమీస్ ఆశలు సజీవం.. కాని..

|

Nov 04, 2022 | 5:07 PM

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పసికూన జట్టు ఆప్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 13 ఓవర్ల వరకు ఉత్కంఠ సాగింది మ్యాచ్. 14వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఆడమ్ జంపా అదే ఓవర్ లో మూడు వికెట్లు తీయడంతో..

AUS vs AFG, T20 WC: ఆప్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా విజయం.. సెమీస్ ఆశలు సజీవం.. కాని..
Aus Vs Afg
Follow us on

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పసికూన జట్టు ఆప్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 13 ఓవర్ల వరకు ఉత్కంఠ సాగింది మ్యాచ్. 14వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఆడమ్ జంపా అదే ఓవర్ లో మూడు వికెట్లు తీయడంతో కంగారు జట్టు ఊపిరిపీల్చుకుంది. 13వ ఓవర్ ముగిసే సమయానికి ఆప్ఘనిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. విజయానికి 42 బంతుల్లో 71 పరుగులు అవసరం కాగా.. ఆప్ఠనిస్తాన్ ఒకే ఓవర్ లో మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఏక పక్షం అయింది. ఆప్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ 54, మిచెల్ మార్ష్ 45, మార్కస్ స్టోయినిస్ 25 పరుగులు చేశారు. ఒకానొక దశలో ఆసీస్ 180 పరుగుల చెయ్యెచ్చని అంచనా వేసినప్పటికి చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా 168 పరుగులకే పరిమితమైంది.

ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు, ఫరుకీ 2 వికెట్లు పడగొట్టారు. ఇక 169 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్ జట్టు మొదట్లో వేగంగా ఆడింది. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. జట్టు స్కోర్ 40 పరుగుల వద్ద 2 వికెట్లను ఆప్ఘనిస్తాన్ కోల్పోయింది. అయితే 99 పరుగుల వరకు మరో వికెట్ కోల్పోకుండా ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్స్ జాగ్రత్త పడ్డారు. అయితే జంపా వేసిన 14వ ఓవర్లో జట్టు స్కోర్ 99 వద్ద వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో ఆప్ఘనిస్తాన్ కష్టాలో పడింది. ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్ గులాబుద్దీన్ 39, రహమనుల్లా గుర్బాజ్ 30, ఇబ్రహిం జర్దాన్ 26 పరుగులు చేశారు. ఛేజింగ్ ను విజయవంతంగా ఆరంభించిన ఆప్ఘనిస్తాన్ చివరిలో తడబడింది. దీంతో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో ఆప్ఘనిస్తాన్ పై గెలుపొందింది.

సెమీస్ ఆశలు సజీవం

ఆస్ట్రేలియా ఆప్ఘనిస్తాన్ పై గెలవడంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే శనివారం ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ పై ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు ఆధారపడనున్నాయి. శ్రీలంక గెలిస్తే గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్ గెలిస్తే ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..