Asian Games 2023: ఆయన స్ఫూర్తితోనే మెడల్స్ గెలిచాం.. ప్రధాని మోదీపై ఏషియన్ గేమ్స్‌ విజేతల ప్రశంసలు

తమ విజయం వెనుక ప్రధాని మోదీ ఉన్నారంటూ ఏషియన్ గేమ్స్‌లో విజయం సాధించిన క్రీడాకారులు గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ అందించిన స్ఫూర్తితోనే తాము ఏషియన్ గేమ్స్‌లో భారత్‌ కొత్త చరిత్రను సృష్టించామన్నారు. న్యూఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో సమావేశమయ్యారు ఏషియన్ గేమ్స్‌లో క్రీడాకారులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Asian Games 2023: ఆయన స్ఫూర్తితోనే మెడల్స్ గెలిచాం.. ప్రధాని మోదీపై ఏషియన్ గేమ్స్‌ విజేతల ప్రశంసలు
PM Modi to Meet Athletes

Edited By: Ravi Kiran

Updated on: Oct 11, 2023 | 1:04 PM

ఇది కొత్త భారతం. అందుకే ఏషియన్‌ గేమ్స్‌లో సరికొత్త చరిత్ర లిఖించింది. కనీవినీ ఎరుగని రీతిలో 107 పతకాలు కొల్లగొట్టింది. ఇక భారత్‌ వదిలిన బాణం.. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. తెలుగమ్మాయి జ్యోతితోపాటు తెలుగు తేజాలు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌, తిలక్‌ వర్మ ఆసియా క్రీడల్లో పతకాలతో మెరిశారు. ఆసియా క్రీడల్లో పతకాల వేటలో ఆటాడేసుకుంది ఇండియా. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో… భారత్‌ మొత్తం 107 పతకాలు కైవసం చేసుకుంది. ఒక్క రోజే భారత్‌ 6 స్వర్ణాలు సాధించింది. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఇండియా కైవసం చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది.

ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. న్యూఢిల్లీలోని థ్యాన్ చంద్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

2023 అక్టోబరు 10వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆసియా క్రీడలు 2022లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతం మాట్లాడారు.

ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు ప్రధాని నరేంద్ర మోదీ అందించిన సపోర్టును క్రీడాకారులు గుర్తుచేసుకున్నారు. భారత్ వివిధ రంగాల్లో రాణిస్తుందని క్రీడాకారుడు నీరజ్ చోప్రా చెప్పడం విశేషం. ఇండియాకు మరిన్ని విజయాలు అందించేందుకు ఇదే సరైన సమయంగా నీరజ్ చోప్రా అభివర్ణించారు.

తమకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన ప్రేరణ ఇచ్చారని క్రికెటర్ యశస్వి జైశ్వాల్ అన్నారు. దేశం గర్వపడేలా మోదీ చేసినప్పుడల్లా తమ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. హకీ ప్లేయర్ సవితా మాట్లాడుతూ.. తాము ఎప్పుడూ పతకాలు గెలుచుకొనే లక్ష్యంతో పాటు ప్రధాని మోదీ కలిసే అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి