ఐసీసీ సంచలన నిర్ణయం.. కొత్త పుంతలు తొక్కుతున్న టెస్ట్ క్రికెట్!

|

Jul 24, 2019 | 2:50 PM

టెస్ట్ క్రికెట్.. ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలను తీర్చిదిద్దిన ఫార్మాట్. ఒకప్పుడు ఈ ఫార్మాట్‌కు ఎక్కువ ఆదరణ ఉండేది. అయితే కాలక్రమేణా వస్తున్న మార్పుల బట్టి వచ్చిన వన్డేలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం మొదలు పెట్టాయి. ఇక వీటి తర్వాత కేవలం మూడు గంటల్లోనే ముగిసే టీ20 సిరీస్‌లు రావడంతో టెస్ట్ క్రికెట్‌కు ప్రమాదం ఏర్పడింది. ఈ ఫార్మాట్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఈ టెస్ట్ సిరీస్‌ను బ్రతికించే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఐసీసీ.. అందుకు ఆగష్టులో ఇంగ్లాండ్, […]

ఐసీసీ సంచలన నిర్ణయం.. కొత్త పుంతలు తొక్కుతున్న టెస్ట్ క్రికెట్!
Follow us on

టెస్ట్ క్రికెట్.. ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలను తీర్చిదిద్దిన ఫార్మాట్. ఒకప్పుడు ఈ ఫార్మాట్‌కు ఎక్కువ ఆదరణ ఉండేది. అయితే కాలక్రమేణా వస్తున్న మార్పుల బట్టి వచ్చిన వన్డేలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం మొదలు పెట్టాయి. ఇక వీటి తర్వాత కేవలం మూడు గంటల్లోనే ముగిసే టీ20 సిరీస్‌లు రావడంతో టెస్ట్ క్రికెట్‌కు ప్రమాదం ఏర్పడింది. ఈ ఫార్మాట్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఈ టెస్ట్ సిరీస్‌ను బ్రతికించే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఐసీసీ.. అందుకు ఆగష్టులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే యాషెస్ సిరీస్‌ను ఎంచుకుంది.

వన్డేల్లో అయితే ప్రతి జట్టు వేరు వేరు రంగులతో జెర్సీలు కలిగి ఉంటుంది కాబట్టి.. ఏ జట్టు బ్యాటింగ్ చేస్తోందో.. ఏ జట్టు ఫీల్డింగ్ చేస్తోందో అభిమానులు ఈజీగా గుర్తుపడుతున్నారు. అంతేకాకుండా వారి జెర్సీలపై పేర్లు, నెంబర్లు కూడా ఉంటాయి. ఇది ఇలా ఉంటే టెస్ట్ ఫార్మాట్‌కు మాత్రం అందరూ వైట్ జెర్సీలోనే ఆడతారు. దీంతో ప్రేక్షకుల్లో కొంత కన్ఫ్యూషన్ ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు అది పోగొట్టడానికే ఐసీసీ.. ఇకపై టెస్ట్‌ల్లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ పేర్లను, నెంబర్లను కలిగిన జెర్సీలు ధరించవచ్చు. ఐసీసీ తీసుకొచ్చిన కొత్త ఆవిష్కరణ ఇది.. అదీ కూడా టెస్ట్ క్రికెట్‌లో తొలిసారి. 1877వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో తెల్లటి, గోధుమ రంగు జెర్సీలు మాత్రమే ధరించేవారు. అయితే వచ్చే నెల నుంచి జరగబోయే యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల ఒప్పందంతో ఆటగాళ్లు తొలిసారి వైట్ జెర్సీలపై పేర్లు, నెంబర్లతో బరిలోకి దిగనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.