Arjun Tendulkar makes Debut: ముంబై సీనియర్ జట్టులో అడుగు పెట్టిన లిటిల్ మాస్టర్ వారసుడు అర్జున్

|

Jan 15, 2021 | 6:08 PM

భారత మాజీ క్రికెటర్ క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇవాళ ముంబై సీనియర్ జట్టు తరపున అరంగ్రేటం చేశాడు. స‌య్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హ‌ర్యానాతో జ‌రిగిన మ్యాచ్లో అర్జున్..

Arjun Tendulkar makes Debut: ముంబై సీనియర్ జట్టులో అడుగు పెట్టిన లిటిల్ మాస్టర్ వారసుడు అర్జున్
Follow us on

Arjun Tendulkar makes Debut : భారత మాజీ క్రికెటర్ క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇవాళ ముంబై సీనియర్ జట్టు తరపున అరంగ్రేటం చేశాడు. స‌య్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హ‌ర్యానాతో జ‌రిగిన మ్యాచ్లో అర్జున్ ఆడాడు.  మ్యాచ్‌లో అతడు ఓ వికెట్ కూడా తీశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అర్జున్ అండ‌ర్‌-19 మ్యాచ్‌లు ఆడాడు.

ముస్తాక్ అలీ టోర్నీ 20-20 ఫార్మాట్‌లో జ‌రుగుతోంది. ఈ టోర్నీలో శుక్రవారం ముంబై త‌న మూడ‌వ మ్యాచ్ ఆడింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ టోర్నీ కోసం 20 మంది స‌భ్యులు ఉన్న జ‌ట్టును ఇటీవల ప్ర‌క‌టించింది. దాంట్లో అర్జున్ టెండూల్క‌ర్ కూడా ఉన్నాడు. కరోనా మహమ్మారి నేప‌థ్యంలో జట్టు స‌భ్యుల సంఖ్య‌ను పెంచేందుకు బీసీసీఐ అనుమ‌తి ఇచ్చింది. దీంతో ముంబై సీనియ‌ర్ జ‌ట్టులో అర్జున్‌కు స్థానం ఖ‌రారైంది. మొద‌టి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం అర్జున్‌ టెండూల్క‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. 21ఏళ్ల అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏజ్ గ్రూప్ టోర్నీల్లోనే ఆడాడు. ముంబై జ‌ట్టుకు సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. ముంబై అర్జున్ మొదట 2017లో ముంబై అండర్ -19 జట్టులోకి ప్రవేశించి, ఆ తరువాత సంవత్సరం భారత్ అండర్-19 జట్టులో ఆడాడు. మరోవైపు . అర్జున్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పైన కూడా గురిపెట్టిన‌ట్లు సమాచారం. మరి అర్జున్ క్రికెట్ లో రాణించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: నీటి కరువుతో 45 రోజుల్లో ఎడారిగా మారనున్న ఆ దేశం.. త్వరలో బంగారం కంటే నీరు విలువైంది కానుందా ..!