Andy Murray tests positive : కరోనా కలకలం.. టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే కు కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది...

Andy Murray tests positive : కరోనా కలకలం.. టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే కు కరోనా పాజిటివ్..

Updated on: Jan 14, 2021 | 7:45 PM

Andy Murray tests positive : కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాప్తి తగ్గుతుందని అంతా ఉపిరిపీల్చుకుంటుంటే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఇప్పుడు కలవరపెడుతుంది. ఇప్పటికే సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌, మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆండీ ముర్రే కు కరోనా పాజిటివ్ అని తేలింది. ముర్రేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గురువారం ప్రకటించారు. అయితే రాబోయే ఆస్ట్రేలియా ఓపెన్‌-2021లో  ఈ టెన్నిస్‌ స్టార్‌ పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడు అతడు ఆడటం అనుమానంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు ముర్రే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Covid Vaccination: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు

మా దేశ మ్యాప్ లో తప్పుల తడకలు చూపుతున్నారు, తొలగించండి, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇండియా అభ్యర్థన