Team India Practice Session: మరో రసవత్త పోరుకు రెడీ అవుతున్న టీమిండియా.. శిక్షణలో తిరిగి చేరిన రహానె , హార్దిక్ పాండ్యా

|

Feb 03, 2021 | 2:18 PM

విదేశీ గడ్డ ఆస్ట్రేలియాపై సత్తా చాటి భారత్ జెండాను సగర్వంగా ఎగరవేసిన టీమిండియా స్వదేశీలో రసవత్తర పోరుకు రెడీ అవుతుంది. కరోనా నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల క్వారెంటైన్ ముగిసింది...

Team India Practice Session: మరో రసవత్త పోరుకు రెడీ అవుతున్న టీమిండియా..  శిక్షణలో తిరిగి చేరిన రహానె , హార్దిక్ పాండ్యా
Follow us on

Team India Practice Session: విదేశీ గడ్డ ఆస్ట్రేలియాపై సత్తా చాటి భారత్ జెండాను సగర్వంగా ఎగరవేసిన టీమిండియా స్వదేశీలో రసవత్తర పోరుకు రెడీ అవుతుంది. కరోనా నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల క్వారెంటైన్ ముగిసింది. మరోవైపు క్రీడాకారులందరికీ కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో సమరానికి రెడీ అవ్వడానికి క్రీడారులు తమ అస్త్రశస్త్రాలను బయటకు తీస్తున్నారు.

చెన్నైలోని చెపాక్ స్టేడియం లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్లకు దిశానిర్ధేశం చేశారు. చిన్నపాటి కసరత్తులు చేసిన ఆటగాళ్లు అనంతరం ఫుట్ బాల్ ను ఆడారు. ఇక మొన్నటి వరకూ పెటర్నిటీ లీవ్ ఉన్న కోహ్లీ కూడా జట్టులో కలిశాడు. ప్రాక్టీస్ చేశాడు. తనదైన రేంజ్ షాట్లు ఆడాడు. ఫ్లిక్, కవర్ డ్రైవ్ షాట్లతో అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఆ వీడియో కి తలదించుకుని కష్టపడి పనిచేయాలంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు విరాట్.

అయితే రోహిత్ శర్మ కోహ్లీ ఇద్దరు కలిసి క్యాచ్చులు ప్రాక్టీస్ చేశారు. జట్టు అంతా కోచ్ అద్వర్యం సాధన చేశారు.. ఇక రోజు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుతో కలిశాడు. వెన్నె సర్జరీ తర్వాత సుదీర్ఘ కాలం రెస్టు లో ఉన్న హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో పాలు పంచుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. మరి హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ ఎలా ఉందొ వేచి చూడాలి మరి.

అజింక్య రహానె ప్రాక్టీస్

మరోవైపు బుధవారం అజింక్య రహానె “ప్రాక్టీస్ లో జాయిన్ అయ్యాడు.ఇంగ్లాండ్‌తో తలపడటానికి కసరత్తులు మొదలు పెట్టాడు. తాజా తాను ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో రెహానే , సౌరభ్ కుమార్ , కె గౌతమ్‌లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు.

Also Read:

ఇంగ్లండ్‌ను తిప్పేద్దాం… ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్న టీమిండియా…

మరోసారి మారుమోగుతున్న టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ పేరు.. ఎందుకంటే..