భారత్-ఆస్ట్రేలియా టీ20.. 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయ బావుటా..

|

Updated on: Dec 04, 2020 | 5:46 PM

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి టీ20 కాన్‌బెర్రా వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకున్నారు.

భారత్-ఆస్ట్రేలియా టీ20.. 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయ బావుటా..

Live Updates: కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసిస్‌పై 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బౌలర్ల విజృంభణతో ఆసిస్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ విజయం సునాయాసమైంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Dec 2020 05:37 PM (IST)

    భారత్-ఆస్ట్రేలియా టీ20.. 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం..

    కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసిస్‌పై 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బౌలర్ల విజృంభణతో ఆసిస్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ విజయం సునాయాసమైంది. తొలుత టాస్ గెలిచిన ఆసిస్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసిస్ ముందుంచింది. స్వల్ప లక్ష్యమే అని భావించిన ఆసిస్‌కు భారత బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. తొలుత ఓపెనర్లుగా బరిలో దిగిన ఆసిస్ ప్లేయర్లు షార్ట్, ఆరోన్ ఫించ్ మంచి ఆ జట్టుకు మంచి శుభారంభాన్నే ఇచ్చారు. అయితే ఆరోన్ ఫించ్ అవుట్‌తో అవడంతో సీన్ అంతా మారిపోయింది. ఫించ్ తరువాత వచ్చిన ఆసిస్ బ్యాట్స్‌మెన్ అంతా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆసిస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 161 పరుగుల చేసి 11 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలాఉండగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా తొమ్మిదోసారి విజయం సాధించి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

  • 04 Dec 2020 05:19 PM (IST)

    పీకల్లోతు కష్టాల్లో కంగారూలు.. ఆరో వికెట్ లాస్.. 18 ఓవర్లు – 126/6

    భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20లో వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా ఆరో వికెట్ కోల్పోయింది. హెన్రిక్ 20 బంతుల్లో 30 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

  • 04 Dec 2020 05:16 PM (IST)

    ఆసిస్‌కు షాక్.. ఐదో వికెట్ డౌన్.. 17 ఓవర్లు - 122/5

    కీలక సమయంలో ఆసిస్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఐదో వికెట్ రూపంలో మాథ్యూ వేడ్ పెవిలియన్ బాట పట్టాడు. 9 బంతుల్లో 7 పరుగులు చేసిని వేడ్‌ను టీమిండియా కెప్టెన్ కోహ్లీ క్యాచ్‌తో క్రిజ్ బయటకు సాగనంపాడు.

  • 04 Dec 2020 05:03 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆసిస్.. 113 పరుగుల వద్ద షార్ట్(38) క్యాచ్ ఔట్..

    162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ జట్టు నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఆసిస్ ఓపెనర్ షార్ట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. నటరాజన్ బౌలింగ్‌లో హార్దిక్ ప్యాండ్ క్యాచ్ పట్టగా షార్ట్ పెవిలియన్ బాట పట్టాడు. 38 బంతులు ఆడిన షార్ట్.. మూడు ఫోర్లు కొట్టి 34 పరుగులు చేశాడు.

  • 04 Dec 2020 05:01 PM (IST)

    ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపు...

    ఆల్విన్ కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ గెలుపొందారు. 800 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇక,  వివేకానంద నగర్ డివిజన్ నుంచి  టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం రోజాదేవి విజయం సాధించారు.

  • 04 Dec 2020 04:58 PM (IST)

    100 పరుగులు పూర్తి చేసిన ఆసిస్.. దూకుడు పెంచిన షార్ట్, హెన్రిక్స్..

    162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ జట్టు 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో షార్ట్ 35 బంతుల్లో 32 పరుగులు, హెన్రిక్స్ 12 బంతుల్లో 19 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు.

  • 04 Dec 2020 04:49 PM (IST)

    దంచి కొడుకుతున్న ఆసిస్ ప్లేయర్లు.. 9 ఓవర్లు - 67/1..

    162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ జట్టు.. ఆరంభం నుండి దూకుడుగా ఆడుతోంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (35) మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ.. షార్ట్(23)తో కలిసి స్టీవ్ స్మిత్(12) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు.

  • 04 Dec 2020 04:44 PM (IST)

    విజృంభిస్తున్న భారత భౌలర్లు.. మరో వికెట్ కోల్పోయిన ఆసిస్.. పెవిలియన్‌కు మాక్స్‌వెట్ ..

    భారత బౌలర్ల దాటికి కంగారూలు విలవిల్లాడిపోతున్నారు. వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. తాజాగా ఆసిస్ మూడో వికెట్ కోల్పోయింది. 79వ ఓవరో గ్లెన్ మాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. 3 బంతులు ఆడిన మాక్స్‌వెల్ 2 పరుగులు చేశాడు.

  • 04 Dec 2020 04:37 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన కంగారూలు.. 72 పరుగుల వద్ద స్మిత్ క్యాచ్ ఔట్..

    భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆసిస్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. 72 పరుగుల వద్ద స్మిత్ క్యాచ్ ఔట్ అయ్యాడు. తొమ్మిది బంతులు ఆడిన స్మిత్.. 12 పరుగులు చేశాడు.

  • 04 Dec 2020 04:23 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆసిస్... 56 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ క్యాచ్ ఔట్..

    భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్చాచ్‌లో ఆసిస్ తొలి వికెట్ కోల్పోయింది. 56 పరుగుల వద్ద ఆరోన్ పించ్(26 బంతుల్లో 35 పరుగులు) క్యాచ్ ఔట్ అయ్యాడు.

  • 04 Dec 2020 03:31 PM (IST)

    ముగిసిన భారత్ బ్యాటింగ్.. 20 ఓవర్లకు 161/7.. ఆసిస్ లక్ష్యం 162..

    కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్‌గా క్రీజ్‌లో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 51 పరుగులు చేశాడు. ఆ తరువాత సంజు శ్యామ్సన్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. చివర్లో రవీంద్ర జడేజా 44 పరుగులు, హార్దిక్ పాండ్య 16 పరుగులు సాధించి భారత్ కు గౌరవప్రద స్కోర్ ను అందించి.. ఆసిస్‌కు 162 పరుగుల లక్ష్యాన్ని విధించారు.

  • 04 Dec 2020 03:15 PM (IST)

    నిలకడగా రాణిస్తున్న జడేజా.. 17 ఓవర్లకు భారత్ స్కోర్ 121/6..

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా నిలకడగా రాణిస్తున్నాడు. 12 బంతుల్లో 12 పరుగులు చేసి జట్టు స్కోర్ పెంచేందుకు ట్రై చేస్తున్నాడు.

  • 04 Dec 2020 03:05 PM (IST)

    హార్దిక్ పాండ్యా ఔట్.. 17 ఓవర్లలో 114 పరుగులు చేసిన టీమిండియా..

    టీమిండియా బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. 15 బంతుల్లో 16 పరుగులు చేసిన పాండ్యా 1 సిక్స్ కొట్టి అభిమానుల్లో ఆశలు పెంచాడు. అంతలోనే ఔట్అవడంతో అభిమానుల ఆశలపై నిల్లు జల్లినట్లైంది. భారత్ స్కోర్ ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సమయానికి 114/6 గా ఉంది.

  • 04 Dec 2020 03:02 PM (IST)

    దూకుడు ప్రదర్శిస్తున్న హార్దిక్ పాండ్య.. సిక్స్ బాది 12 బంతుల్లో 13 పరుగులు

    హార్దిక్ పాండ్యా దూకుడు పెంచాడు. 12 బంతుల్లో 13 పరుగులు చేసిన పాండ్యా ఒక సిక్స్ బాదాడు.

  • 04 Dec 2020 02:56 PM (IST)

    15 ఓవర్లు కంప్లీట్.. ఐదు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసిన భారత్

    15 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 100 పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో హార్ధిక్ పాండ్య(7), రవీంద్ర జడేజా(4)తో నిలకడగా ఆడుతున్నారు.

  • 04 Dec 2020 02:52 PM (IST)

    వరుసగా పెవిలియన్ బాట పట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. రాహుల్ ఔట్..

    భారత్ -ఆస్ట్రేలియా మధ్యజరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. 13వ ఓవర్ 5వ బంతికి రాహుల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 40 బంతులాడిన రాహుల్.. 5 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 51 పరుగులు చేశాడు. ప్రస్తుతం హార్ధిక్ పాండ్య(2), రవీంద్ర జడేజా(2) క్రీజ్‌లో ఉన్నారు.

  • 04 Dec 2020 02:46 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. 90 పరుగుల వద్ద మనీష్ పాండే ఔట్..

    భారత్ -ఆస్ట్రేలియా మధ్యజరుగుతున్న తొలి టీ20లో టీమిండియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 90 పరుగుల వద్ద మనీష్ పాండే(8 బంతుల్లో 2 పరుగులు) క్యాచ్ ఔట్ అయ్యాడు.

  • 04 Dec 2020 02:41 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్.. 12 ఓవర్లలో 90/3గా టీమిండియా స్కోర్..

    భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. సంజు శ్యామ్సన్ (23) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 12వ ఓవర్ తొలి బంతిని శ్యామ్సన్ స్ట్రైక్ చేయగా, హెన్రిక్ క్యాచ్ పట్టాడు. దీంతో శ్యామ్సన్ పెవిలియన్ బాట పట్టాడు. 15 బంతులాడిన శ్యామ్సన్ ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 23 పరుగులు చేశాడు. శ్యామ్సన్ అనంతరం క్రీజ్‌లో మనీష్ పాండే వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 86/3 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్), మనీష్ పాండే ఉన్నారు.

  • 04 Dec 2020 02:32 PM (IST)

    అర్ధ శతకంతో ఆకట్టున్న రాహుల్....

    భారత ఆటగాడు కేఎల్ రాహుల్ అర్ధ శతకం సాధించాడు. ఆసీస్ తో జరుగుతున్న మొదటి టీ20 లో రాహుల్ తన బ్యాటింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ... 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 50 పరుగులు పూర్తి చేశాడు.

  • 04 Dec 2020 02:28 PM (IST)

    పది ఓవర్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు సాధించింది...

    పది ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(48), సంజు శ్యామ్సన్(15) ఉన్నారు.

  • 04 Dec 2020 02:23 PM (IST)

    సంజు సిక్స్...

    భారత ఆటగాడు సంజు శ్యామ్సన్ ఆసీస్ బౌలర్ స్వెప్సన్ వేసిన తొమ్మిదో ఓవర్ మొదటి బంతికే కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు...

  • 04 Dec 2020 02:19 PM (IST)

    కొహ్లీ (9) ఔట్...

    భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ(9) ఏడో ఓవర్లో ఔట్ అయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(38), శ్యామ్సన్(1) ఉన్నారు.

  • 04 Dec 2020 02:14 PM (IST)

    ఆరో ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన రాహుల్... 12 పరుగులు రాబట్టిన టీమిండియా....

    టీమిండియా ఆరో ఓవర్లో 12 పరుగులు రాబట్టింది. భారత ఆటగాడు కేఎల్ రాహుల్ అబాట్ బౌలింగ్ లో వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ కొట్టి ఆరు బంతుల్లో 12 పరుగులు రాబట్టారు. క్రీజులో విరాట్(8), రాహుల్(31) ఉన్నారు.

  • 04 Dec 2020 02:11 PM (IST)

    ఫోర్ కొట్టిన విరాట్... నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 21

    ధావన్ ఔట్ అయిన తర్వాత క్రీజులో వచ్చిన విరాట్ ధాటిగా ఆడుతున్నాడు. నాలుగో ఓవర్లో హజిల్ వుడ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టాడు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ ఒక వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. క్రీజులో విరాట్(7), రాహుల్(11) ఉన్నారు.

  • 04 Dec 2020 01:58 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన భారత్... ధావన్(1) ఔట్...

    టీమిండియా తొలి వికెట్ ను కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్ లో ధావన్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్(1), రాహుల్(9) ఉన్నారు.

Published On - Dec 04,2020 5:37 PM

Follow us