Ajinkya Rahane : ఇటీవల టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్లేస్ రీప్లేస్ అవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..ఆస్ట్రేలియా గడ్డపై రహానే కెప్టెన్సీలో భారత్ సంచనలన విజయం నమోదు చేసిన నేపథ్యంలో కోహ్లీ స్థానంలో సీనియర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానేకు బాధ్యతలు ఇవ్వాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. కాగా ఈ వార్తలపై రహానే స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ కు కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరిస్తాడని స్పష్టం చేసాడు రహానే. తాను వైస్ కెప్టెన్ గా నే ఉంటానని, కోహ్లీ లేని సమయంలో కెప్టెన్ గా బాధ్యతలను సవీకరిస్తానని అన్నాడు. జట్టు సమిష్టి గా కృషి చేయడమే ఆసీస్‌లో ఘన విజయానికి కారణమని రహానే తెలిపాడు. ఇక కోహ్లీ తాను పరస్పరం ఎంతో గౌరవంగా, పారదర్శకంగా ఉంటామని చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ బ్యాట్స్‌మన్.
మరిన్ని ఇక్కడ చదవండి :
రెండు టెస్ట్‌లకు దూరమవడం బాధాకరం.. రెస్ట్ తర్వాత టీం ఇండియాపై చెలరేగిపోతానంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్