Ind vs Aus, 4th Tes: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. ఇరు జట్లకు కీలకంగా మారిన నాలుగో టెస్ట్‌

Ind vs Aus, 4th Tes: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ గబ్బా వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్ట్‌ జరగనుంది. టాస్...

Ind vs Aus, 4th Tes: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. ఇరు జట్లకు కీలకంగా మారిన నాలుగో టెస్ట్‌

Updated on: Jan 15, 2021 | 6:22 AM

Ind vs Aus, 4th Tes: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ గబ్బా వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్ట్‌ జరగనుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1 సమంగా ఇరు జట్లు ఉన్నాయి. కాగా, ఈ చివరి టెస్టు ఇరుజట్లకు కీలకంగా మారనుంది. టెస్టుల్లో టి. నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రం చేయనున్నారు.

అయితే తొలిటెస్టును టీమిండియా ఓడిపోగా, రెండో మ్యాచ్‌ను భారత్‌ గెలిచింది. మూడో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆడడానికి భారత్‌ నుంచి 11 మంది ఉంటారా..? అనే పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. సిరీస్‌లో ప్రతి టెస్ట్‌కు ముందు రోజే భారత్‌ జట్టు కూర్పును ప్రకటించే వారు. కానీ ఈ టెస్ట్‌ విషయానికి వచ్చేసరికి టాస్‌కు కాస్త ముందుగా వెల్లడించింది.

Also Read:Thailand Open : 2వ రౌండ్‌లో సైనా నెహ్వాల్ పరాజయం.. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన శ్రీకాంత్