
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో జరిగిన నాల్గవ T20Iలో న్యూజిలాండ్ భారత్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో ఆది నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడిన టీమిండియాకు శివం దూబే కాస్త ఊరటనిచ్చాడు .ఈ క్రమలో కేవలం 15 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో హాఫ్ సెంచరీ చేశాడు.
13వ ఓవర్లో శివం దూబే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జాకబ్ డఫీ ఓవర్ ఐదవ బంతికి సిక్స్ కొట్టి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న అతను, వేగంగా అర్ధశతకం పూర్తి చేసుకున్న భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ (14 బంతులు), యువరాజ్ సింగ్ (12 బంతులు) కంటే అతను ముందున్నాడు.
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జాక్ ఫౌల్క్స్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, మాట్ హెన్రీ.