Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్ స్టూడెంట్స్‌కు IAS కోచింగ్..

LeadIAS జూనియర్ అనేది 5వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ విద్యార్థుల కోసం రూపొందించబడిన సివిల్ సర్వీసెస్ టాలెంట్ డెవలప్‌మెంట్ కోర్సు. స్కూల్ స్టేజ్ నుంచే విద్యార్థులను కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ఉన్నత శ్రేణి ఉద్యోగులుగా మలచాలనే సంకల్పంతో సౌత్ ఇండియాలోనే విజయవంతంగా నడుస్తున్న సివిల్ సర్వీసెస్ అకాడమీలలో ఒకటైన LeadIAS అకాడమీ ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

స్కూల్ స్టూడెంట్స్‌కు IAS కోచింగ్..
Best IAS Academy LeadIAS
Follow us
Shaik Madar Saheb

| Edited By: TV9 Telugu

Updated on: Oct 03, 2023 | 6:38 PM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పాఠ్యపుస్తకాల పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. నైపుణ్యం కూడా చాలా అవసరం. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే బట్టీ చదువులు కాకుండా నైపుణ్యంతో కూడిన మెలకువలు నేర్చుకోవడం ఎంతో ముఖ్యం. వ్రాత నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక విషయాన్ని అనేక కోణాల్లో విశ్లేషించగలగడం అలవాటు చేసుకుంటేనే ఉన్నత విజయాలు సాధించగలం. ఈ పోటీ ప్రపంచంలో స్కూల్, కాలేజీ ఏజ్‌‌లోనే ఈ నైపుణ్యాలను అలవర్చుకుంటే వారు కళాశాల నుంచి బయటకు వచ్చీరాగానే ఉద్యోగం సాధించవచ్చు. విద్యార్థుల స్కూల్, కాలేజీ చదువుకుంటూ ఇదంతా నేర్చుకుంటే వారు అద్భుతాలు సృష్టించవచ్చు.

LeadIAS జూనియర్ అనేది 5వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ విద్యార్థుల కోసం రూపొందించబడిన సివిల్ సర్వీసెస్ టాలెంట్ డెవలప్‌మెంట్ కోర్సు. స్కూల్ స్టేజ్ నుంచే విద్యార్థులను కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ఉన్నత శ్రేణి ఉద్యోగులుగా మలచాలనే సంకల్పంతో సౌత్ ఇండియాలోనే విజయవంతంగా నడుస్తున్న సివిల్ సర్వీసెస్ అకాడమీలలో ఒకటైన LeadIAS అకాడమీ ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వన్ ఇయర్ కోర్సులో సీనియర్ ఫ్యాకల్టీతో వీకెండ్ క్లాసులు, వన్-ఆన్-వన్ వీక్లీ మెంటర్‌షిప్ సెషన్‌లు, ఫాక్ట్ బేస్డ్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంతేకాకుండా LeadIAS జూనియర్ సంస్థ తమ విద్యార్థుల కోసం ప్రతినెలా IAS/IPS అధికారులతో ఇంటరాక్ట్ అవడానికి ప్లాట్‌‌ఫామ్ ఏర్పాటు చేస్తుంది.

UPSC టాపర్స్‌గా అనేకమందిని తయారు చేసిన తర్వాత LeadIAS అకాడమీ పాఠశాల విద్యార్థుల కోసం కూడా అలాంటి ప్రోగ్రామ్‌ను రూపొందించి స్కూల్ దశ నుంచే వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ప్రస్తుతం ఇండియాలో LeadIAS జూనియర్ అనేది ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్. ఇక్కడ మీరు సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావడానికి అవసరమైన స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇందుకోసమే LeadIAS సంస్థ తమ శిక్షణ కార్యక్రమాలను కేరళ, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, దుబాయి అంతటా విస్తరించింది. సీనియర్ IAS/IPS అధికారుల మార్గదర్శకాల ప్రకారం LeadIAS జూనియర్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ పాఠ్య ప్రణాళికలు రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, బేసిక్స్ ఆఫ్ డేటా సైన్స్, లీగల్ అవేర్‌నెస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, గుడ్ గవర్నెన్స్ వంటి ఎన్నో అంశాలు మెంటర్‌షిప్ సెషన్‌లు, వీకెండ్ క్లాసుల్లో కవర్ చేస్తారు. LeadIAS అకాడమీలో విద్యార్థులకు వర్క్‌బుక్‌లతో పాటు, నిపుణులైన ట్యూటర్‌లతో ఆన్‌లైన్‌లో లైవ్‌ క్లాసెస్ నిర్వహిస్తారు. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక మెంటర్‌ను కేటాయించి కోచింగ్ అందిస్తారు. వాస్తవానికి స్కూల్, కాలేజీల్లో దొరకని ఎన్నో స్కిల్స్‌ని LeadIAS జూనియర్ తమ విద్యార్థులకు నేర్పించి వారిని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది.

Best Ias Academy Leadias

LeadIAS Juniorలోనే ఎందుకు నేర్చుకోవాలి?:

ఈ ఆధునిక యుగంలోని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ అంశాల మీద పట్టు అవసరం. అందుకే చిన్న వయస్సులోనే ఆ స్కిల్స్ పెంపొందించుకుంటే అవి విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్‌లో అవసరమైన చోట విన్నర్‌గా నిలబెడుతాయి. ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో ఇలాంటి వారికే డిమాండ్ ఎక్కువ. మల్టీ నేషనల్ కంపెనీలు కూడా అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుత కాలంలో విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కెరీర్‌పై ఫోకస్ పెడుతున్నారు. అలా కాకుండా స్కూల్, కాలేజ్ స్టేజ్ నుంచే కెరీర్‌పై ఫోకస్ పెడితే చిన్న వయస్సులోనే చాలా నేర్చుకుని అద్భుతాలు సృష్టించగలరు. ఇది గ్రహించిన LeadIAS జూనియర్ సంస్థ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు, చిన్న వయసు నుంచే వారికి క్రియేటివ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకునే విధంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు.

LeadIAS Junior లో అడ్మిషన్ పొందడానికి 903290 2878 నెంబర్‌లో సంప్రదించండి.