Jos Alukkas: కీర్తి సురేష్ వివాహం కోసం అద్భుతమైన నెక్లెస్‌ను రూపొందించిన జోస్ ఆలుక్కాస్.. మీకు కూడా కావాలంటే ఇలా చేయండి..

భారతీయ రాజ ఆభరణాల వైభవం నుంచి ప్రేరణ పొందిన ఈ నెక్లెస్, రాజస్థాన్‌లో మండుతున్న ఇసుక నుంచి సేకరించిన ముదురు ఎరుపు రంగు కెంపులు, అన్‌కట్ పోల్కీలు, అద్భుతమైన వజ్రాల సామరస్యమైన సమ్మేళనాన్ని కలిగి ఉంది. రాజమందిరాల్లోని షాండ్లియర్లను గుర్తుకు తెచ్చే సంక్లిష్టంగా అలంకృతమైన చిత్రాలు సొంపుగా జాలువారుతూ ఆధునికత, సంప్రదాయాలు రెండింటినీ ప్రతిబింబించే విధంగా అద్భుతమై  డిజైన్‌ను రూపుదిద్దుకున్నాయి..

Jos Alukkas: కీర్తి సురేష్ వివాహం కోసం అద్భుతమైన నెక్లెస్‌ను రూపొందించిన జోస్ ఆలుక్కాస్.. మీకు కూడా కావాలంటే ఇలా చేయండి..
Jos Alukkas

Updated on: Mar 05, 2025 | 3:35 PM

ఆంధ్రప్రదేశ్/తెలంగాణ: వధువు ఆభరణాలు కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమే కాదు – ఇది ప్రతి రత్నంపై ఉన్న వారసత్వం, కళాత్మకత, భావోద్వేగాల ప్రతిబింబం. చక్కటి ఆభరణాలలో విలక్షణమైన పేరైన జోస్ ఆలుక్కాస్ సుప్రసిద్ధ సినీనటి కీర్తి సురేష్ వివాహం కోసం ఒక శ్రేష్టమైన కెంపు, పోల్కీ వజ్రాల నెక్లెస్‌ను రూపొందించింది. ఈ ఆభరణం సంప్రదాయాన్ని, కాలాతీతమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిఫలిస్తుంది.

తన చిరకాల ప్రేమికుడు, పారిశ్రామికవేత్త అయిన ఆంటోనీ తట్టిల్‌ను 2024 డిసెంబర్ 12న, గోవా సముద్ర తీరంలో జరిగిన ఒక ఆత్మీయమైన అద్భుతమైన వేడుకలో కీర్తి సురేష్ వివాహం చేసుకున్నారు. సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో, ఈ జంటకు ప్రత్యేకమైన ఆ రోజు ప్రేమ, ఆనందం, శాశ్వతంగా నిలిచిపోయే క్షణాలతో నిండిపోయింది. మరచిపోలేని ఈ సందర్భానికి చిహ్నంగా, జోస్ ఆలుక్కాస్ తమ హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన కళాఖండాన్ని, సంస్కృతి, శ్రేష్టతల పట్ల తనకున్న ప్రేమను ప్రతిఫలించే ఒక నెక్లెస్‌ను కీర్తి ధరించారు.

రాచరిక సంప్రదాయం నుంచి స్ఫూర్తిపొందిన ఒక దివ్యమైన నెక్లెస్..

భారతీయ రాజ ఆభరణాల వైభవం నుంచి ప్రేరణ పొందిన ఈ నెక్లెస్, రాజస్థాన్‌లో మండుతున్న ఇసుక నుంచి సేకరించిన ముదురు ఎరుపు రంగు కెంపులు, అన్‌కట్ పోల్కీలు, అద్భుతమైన వజ్రాల సామరస్యమైన సమ్మేళనాన్ని కలిగి ఉంది. రాజమందిరాల్లోని షాండ్లియర్లను గుర్తుకు తెచ్చే సంక్లిష్టంగా అలంకృతమైన చిత్రాలు సొంపుగా జాలువారుతూ ఆధునికత, సంప్రదాయాలు రెండింటినీ ప్రతిబింబించే విధంగా అద్భుతమై  డిజైన్‌ను రూపుదిద్దుకున్నాయి.. జాగ్రత్తగా అమర్చిన ప్రతి రత్నం సురేష్ కీర్తి వ్యక్తిగత శైలిని, ఆమె ప్రత్యేక రోజు విశిష్టతను ప్రతిబింబిస్తూ, ఘనమైన, అదే సమయంలో మనోహరమైన ఛాయా రేఖను జత చేస్తుంది.

వధువుగా తన అలంకరణలకు భావోద్వేగమైన లోతును జోడిస్తూ, 30 సంవత్సరాల క్రితం తన తల్లి ఆమె వివాహంలో ధరించిన ప్రతిష్టాత్మకమైన ఎర్ర రంగు బెనారస్ చీరను అద్భుతమైన నెక్లెస్‌ను కీర్తి జత చేశారు. సుప్రసిద్ధ డిజైనర్ అనితా డోంగ్రే పునరుద్ధరించి, తిరిగి డిజైన్ చేసిన ఈ చీరలో సంక్లిష్టమైన వెండి పూల నమూనాలు, జరీ ఎంబ్రాయిడరీ ఉన్నాయి.. అవి నెక్లెస్ ప్రకాశానికి మరింత అందాన్ని సంతరింపజేశాయి. మ్యాచింగ్ చెవిపోగులు, విస్పష్టమైన పాపిడి గొలుసు, సున్నితమైన గాజుల సెట్‌తో ఈ అపురూప సమ్మేళనం పూర్తయింది. ప్రతి ఆభరణం కీర్తి లావణ్యాన్ని, చక్కదనాన్ని చాటి చెప్పింది.

తన తల్లి చీరని ధరించాలనే కీర్తి ఎంపిక ఆమె పెళ్ళి రోజుకు ప్రగాఢమైన వ్యక్తిగత, భావోద్వేగ క్షణాలను జత చేసింది.. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, బంధాన్ని, తరతరాలకు సంక్రమించే సంప్రదాయాల వారసత్వాన్ని ప్రతిఫలించింది.

జోస్ ఆలుక్కాస్, మేనేజింగ్ డైరెక్టర్ జాన్ ఆలుక్కాస్ మాట్లాడుతూ “మా బ్రాండ్ అంబాసిడర్ అయిన కీర్తి సురేష్ కోసం ఈ విశిష్టమైన ఆభరణాన్ని రూపొందించడం అనేది కేవలం సృజనాత్మకమైన ప్రయాణం మాత్రమే కాదు, వ్యక్తిగతం కూడా. ఎన్నో సంవత్సరాలుగా మాకు కీర్తితో మంచి అనుబంధం ఉంది.. ఇది జోస్ ఆలుక్కాస్‌లో మేమందరం వేడుక చేసుకునే ఒక సందర్భం. ఈ నెక్లెస్ కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు – కళాత్మకతకు, విశిష్టతకు, ఆమెతో మేము పంచుకున్న లోతైన బంధానికి ఒక ప్రతీక” అని చెప్పారు.

మీరు కూడా ఇలాంటి ఆభరణాలను ఆర్డర్ ఇవ్వాలనుకుంటే జోస్ ఆలుక్కాస్ రిక్వెస్ట్ ఫాం లింక్ ను క్లిక్ చేయండి..

వధువుల కోసం ప్రత్యేకమైన ఆభరణాల కలెక్షన్‌ను ప్రవేశపెడుతున్నాం..

వారసత్వం, హస్తకళా నైపుణ్యాల ఈ కలయికని వేడుక చేసుకోవడానికి, వధువుల కోసం వ్యక్తిగతంగా రూపొందించే ఆభరణాల ప్రత్యేక శ్రేణిని జోస్ ఆలుక్కాస్ ప్రవేశపెట్టింది. ఈ కలెక్షన్ సంప్రదాయం, వ్యక్తిగతీకరణల సారంతో మూర్తీభవించి ఉంటుంది.. తమ విశిష్టమైన కథను ప్రతిఫలించే ఆభరణాల సృష్టికి ఒక అవకాశాన్ని వధువులకు అందిస్తోంది. అవి కాలాతీతమైన పోల్కీ నెక్లెస్‌లు కావచ్చు. సంక్లిష్టమైన ఆలయాల డిజైన్లతో కూడిన ఆభరణాలు కావచ్చు లేదా సమకాలీనమైన వజ్రాభరణాల సృష్టి కావచ్చు. ప్రత్యేకత, చక్కదనం ఇంకా వారసత్వాన్ని కోరుకునేవారికి ఈ కలెక్షన్‌ను అంకితం చేస్తున్నాం..

దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఉన్న జోస్ అలుక్కాస్ షోరూమ్‌లలో ప్రత్యేకంగా లభ్యమయ్యే ఈ బ్రైడల్ కలెక్షన్ ఆధునికమైన అధునాతనను వారసత్వ నైపుణ్యంతో మిళితం చేసిన తమ కాలాతీతమైన కళాఖండాలను సృష్టించుకోవడానికి వధువులను ఆహ్వానిస్తోంది.