భారత టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారతి ఎయిర్‌టెల్.. దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో Airtel 5G సేవలను ప్రారంభించింది. దేశంలోని ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, వారణాసి, సిలిగురి, నాగ్‌పూర్‌తో సహా 8 నగరాల్లో 5 జీ ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నగరాల్లోని కస్టమర్‌లు అత్యాధునిక ఎయిర్‌టెల్ 5G ప్లస్ సేవలను దశలవారీగా ఆస్వాదించవచ్చు.. ఆనందించవచ్చు. ఎందుకంటే కంపెనీ పూర్తి రోల్ అవుట్‌తో 5జీ సేవలను అందించనుంది. ఈ ప్రాంతాల్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు పూర్తి రోల్ అవుట్‌తో మరింత వేగంగా వారి ప్రస్తుత డేటా ప్లాన్‌లతో హై స్పీడ్ ఎయిర్‌టెల్ 5G ప్లస్ సేవలను పొందుతారు.
Airtel 5G ప్లస్‌తో నెక్స్ట్ జెన్ కనెక్టివిటీ..
Airtel 5G Plus ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన పర్యావరణ వ్యవస్థతో విస్తృత ఆమోదం పొందిన సాంకేతికతపై ఆధారపడి సేవలందించనుంది. ఇది ఏదైనా 5G స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు వారి ప్రస్తుత 4G SIMతో వెంటనే Airtel 5G ప్లస్ అనుభవాన్ని ఆస్వాదించడానికి వెంటనే అనుమతిస్తుంది. 4జీ కంటే.. 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో 5G నెట్‌వర్క్‌ను అందిచడమే కాకుండా వాయిస్ కాల్స్ సైతం అద్భుతంగా, శరవేగంగా కనెక్ట్ అవుతాయని ఎయిర్‌టెల్ వాగ్దానం చేస్తోంది.
Airtel 5G ప్లస్‌ని ఆస్వాదించడానికి మీరు చేయాల్సిందల్లా మీ నగరంలో 5G సేవలు అందుబాటులో ఉన్నాయా..? మీ స్మార్ట్‌ఫోన్ 5G నెట్‌వర్క్‌కి సిద్ధంగా ఉందా..? లేదో.. తెలుసుకోవడానికి తక్షణమే Airtel Thanks App లో లాగిన్ అవ్వండి. ఈ రెండూ అందుబాటులో ఉంటే మీరు మీ ఫోన్ ‘Network Settings’ నుంచి 5G నెట్‌వర్క్‌ని ఎంచుకోవచ్చు. ఎయిర్‌టెల్ 5G ప్లస్ హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మల్టిపుల్ చాటింగ్, గేమింగ్, ఇతర ఫీచర్లతో పాటు ఫోటోలను ఇన్‌స్టంట్ అప్‌లోడ్ చేయడానికి ఇది శరవేగంగా అనుమతిస్తుంది.
Airtel 5G Plus: విజయవంతమైన పరీక్షలు, ట్రయల్స్ ద్వారా ఆవిష్కృతం..
టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 2023 నాటికి అర్బన్ ఇండియా మొత్తాన్ని తన 5G నెట్‌వర్క్ కవరేజీలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మార్చి 2024 నాటికి భారతదేశం అంతటా 5G కవరేజీని పూర్తిచేయనుంది.
ఎయిర్‌టెల్ 5G ప్లస్ సేవల ప్రారంభం గురించి భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, CEO గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. “భారత టెలికాం విప్లవంలో ఎయిర్‌టెల్ గత 27 సంవత్సరాలుగా ముందంజలో ఉంది. మా కస్టమర్‌లకు ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి అత్యుత్తమ నెట్‌వర్క్‌ను రూపొందించినందున ఈ రోజు మా ప్రయాణంలో ఇది మరో కీలక ముందడుగు.. మేము చేసే ప్రతి పనిలోనూ కస్టమర్‌లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటాం..’’
గత ఏడాది కాలంలో 5G నెట్‌వర్క్‌పై ఎయిర్‌టెల్ పలు పరిశోధనలు నిర్వహించింది. దీనిద్వారా పని వాతావరణం, వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశముందని నిర్ధారించుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అందించిన ట్రయల్ నెట్‌వర్క్‌లలో ఎయిర్‌టెల్ హైదరాబాద్‌లో ఫస్ట్‌లైవ్ 5G నెట్‌వర్క్‌ను విజయవంతంగా ప్రదర్శించింది. భారతదేశపు మొట్టమొదటి లైవ్ 5G హోలోగ్రామ్‌తోపాటు.. అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం ద్వారా దేశంలోని మొట్టమొదటి 5G ఆధారిత అంబులెన్స్‌ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తయారీ ఉత్పాదకతను పెంచడానికి బాష్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ టెస్ట్ 5G నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఎయిర్‌టెల్ 5G ప్లస్ సేవలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి..