Vontimitta: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో (Kodanda Ramalayam) సీతారాముల కళ్యాణం(Sitaramuala Kalayam) ఘనంగా నిర్వహిస్తున్నారు. రాములోరి కల్యాణానికి సీఎం జగన్ హాజరయ్యారు. ముందుగా ఒంటిమిట్ట ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామాలయంలో స్వాముల వారిని దర్శించున్నారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సంప్రదాయ రీతిలో రామయ్య దర్శనానికి సీఎం జగన్ వెళ్లారు. సీఎంతో పాటు టిటిడి ఛైర్మన్ దంపతులు , మంత్రి రోజా, స్దానికి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్దున రెడ్డి , శ్రీకాంత్ రెడ్డి , కడప జిల్లా శాసనసభ్యులున్నారు.
ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం పున్నమి వెన్నెలలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటలవరకు జరుకానున్నది.
మరోవైపు సీతారాముల కల్యాణం కోసం ఏపీ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరి చందన్ దంపతులు రాజ్ భవన్ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుక జరగగా, హారిచందన్ దంపతుల తరుపున గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాల మేరకు రాజ్ భవన్ ఉప కార్యదర్శి విశ్వనాథ సన్యాసిరావు శుక్రవారం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సీతారాములకు సమర్పించారు.
శ్రీకోదండ రాముని కల్యాణికి కానుకలుగా శ్రీవారి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలను టీటీడీ ఛైర్మన్ దంపతులు సమర్పించారు. శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాల కానుకను ఇచ్చారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహస్తున్నారు.
Also Read: Nepal Crisis: ఆర్ధిక సంక్షోభం దిశగా మరో పొరుగు దేశం.. డ్రాగన్ కంట్రీ కంత్రీ పనియేనా..!