విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి.. ఇవాళ యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 10 గంటల 30 నిముషాలకు యాదగిరిగుట్ట అతిధిగృహానికి చేరుకుని.. 10:45 నిముషాలకు నారసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ పునః ప్రారంభం తర్వాత తొలిసారి యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఆలయ నిర్మాణం పరిశీలన అనంతరం.. మధ్యాహ్నం 11:50నిముషాలకు యాదమహర్షి విగ్రహాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మీడియాను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు తిరుగుపయనం కానున్నారు స్వామి స్వరూపానందేంద్ర.
ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..
Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..