ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల కలను తీరుస్తూ నిర్మించిన రామాలయం త్వరలో ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. 2024 ఏడాదిలో జనవరి 22వ తేదీన రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సాధువులు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. బాల రాముడు ప్రాణ ప్రతిష్ట సమయం ఆసన్నమవుతున్న వేళ.. దాదాపు నెల రోజుల ముందు గుజరాత్ లోని ఒక వజ్రాల వ్యాపారి రామయ్యపై తన రామ భక్తిని చాటుకున్నారు. రామ మందిరం ఇతివృత్తంపై ఒక హారాన్ని తయారు చేయించారు. వివరాల్లోకి వెళ్తే..
సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి శ్రీరామచంద్ర స్వామికి ఏకంగా వజ్రాల హారం చేయించారు. 40 మంది నిపుణులు 35 రోజుల పాటు పాటు కష్టపడి ఈ హారాన్ని అతి సుందరంగా తయారు చేశారు. అయోధ్య రామమందిరాన్ని పోలి ఉండేలా వజ్రాల హారాన్ని తయారుచేశారు. 5 వేల అమెరికన్ డైమండ్లు, 2 కిలోల వెండితో చేసిన ఈ హారంలో మందిర నమూనాకే 3 వేల వజ్రాలు వాడారు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్ విగ్రహాలకు కూడా వజ్రాల హారాలు పొదిగారు. మొత్తం 40 మంది కళాకారులు 35 రోజుల్లో డిజైన్‌ను పూర్తి చేశారు. ఈ నెక్లెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 22న ఈ డైమండ్ నెక్లెస్‌ను అయోధ్య ఆలయ కమిటీకి అందజేయనున్నారు.
#WATCH | Surat, Gujarat: A diamond merchant from Surat has made a necklace on the theme of the Ram temple using 5000 American diamonds and 2 kg silver. 40 artisans completed the design in 35 days. pic.twitter.com/nFh3NZ5XxE
— ANI (@ANI) December 18, 2023
మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవానికి ఒక వారం ముందు, ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక కర్మలు జనవరి 16న ప్రారంభమవుతాయని ట్రస్ట్ బోర్డు నివేదించింది. అయోధ్యలో 4.40 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని జనవరి 22న శ్రీరాముని ప్రతిష్ఠాపన తర్వాత భక్తుల కోసం తెరవనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..