పరమ పవిత్ర కార్తీక మాసం ప్రారంభం, నేడు బెజవాడ దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ

పన్నెండు మాసాల్లో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసం హరిహరులిద్దరికి ఎంతో ప్రీతిపాత్రమైనది .

పరమ పవిత్ర కార్తీక మాసం ప్రారంభం, నేడు బెజవాడ దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ

Updated on: Nov 16, 2020 | 7:30 AM

పన్నెండు మాసాల్లో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసం హరిహరులిద్దరికి ఎంతో ప్రీతిపాత్రమైనది . ఈ క్రమంలో నేటి నుంచి ప్రముక ఆలయాల్లో  ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ఆరంభమవుతోంది.

కాగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల వద్ద ఆకాశ దీపాలు కనువిందు చేస్తున్నాయి.  ఇక సోమవారం అమ్మవారి మూలస్వరూపానికి మట్టి గాజులతో విశేష అలంకరణ చేయనున్నారు. దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు వివిధ రంగలు గాజులను దండలుగా కట్టి దుర్గమ్మకు అలంకరించనున్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో..అమ్మవారి ఆలయ ప్రాంగణం వరకే గాజుల అలంకరణ చేశారు.  ఏటా దుర్గమ్మను, ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 15, 18వ శతాబ్దంలో అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంతో విజయనగర మహారాజు దుర్గమ్మ అలంకరణ నిమిత్తం బంగారు ఆభరణాలను తయారు చేయించడంతో పాటు గాజులతో విశేష అలంకరణ చేసినట్లు వేద పండితులు చెబుతున్నారు. కాగా మశ్లేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సోమవాారం ఉదయం 9 గంటలు శంకుస్థాపన, శిలాఫలకాన్ని  ఆవిష్కరించనున్నారు.

Also Read : రాజస్తాన్ లో రేపు ‘శాంతి విగ్రహాన్ని’ ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ..వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే !

 

Loading...
Unable to load recommendations.
Follow Us