రాజస్తాన్ లో రేపు ‘శాంతి విగ్రహాన్ని’ ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ..వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే !

ప్రధాని మోదీ రేపు రాజస్తాన్ లో ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ (శాంతి విగ్రహాన్ని) ఆవిష్కరించనున్నారు. ‘జైనాచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ జీ మహారాజ్..

  • Umakanth Rao
  • Publish Date - 9:38 pm, Sun, 15 November 20

ప్రధాని మోదీ రేపు రాజస్తాన్ లో ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ (శాంతి విగ్రహాన్ని) ఆవిష్కరించనున్నారు. ‘జైనాచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ జీ మహారాజ్ 151 వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాజస్థాన్ పాలీ లోని విజయ వల్లభ సాధన కేంద్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. 151 అంగుళాల పొడవైన ఈ విగ్రహాన్ని అష్టధాతు లోహాలతో తయారు చేశారు. మహావీరుని శాంతి సందేశాన్ని విజయ వల్లభ లోకానికి చాటారు.