Vastu Tips: ఇంట్లో వాస్తుని ప్రభావితం చేసే వస్తువులు.. ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తితో ఇబ్బందులు తప్పవట..

|

Dec 19, 2022 | 3:48 PM

ఇంటి వాస్తును ప్రభావితం చేసే కొన్ని వస్తువుల వలన ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.  ఇంట్లో ఇలాంటి 5 వస్తువులు ఉంటే..  ప్రతికూల శక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాదు ఆ ఇంట్లో నివసించే ప్రతి సభ్యుని జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది.

Vastu Tips: ఇంట్లో వాస్తుని ప్రభావితం చేసే వస్తువులు.. ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తితో ఇబ్బందులు తప్పవట..
Vastu Tips
Follow us on

జీవితంలో సానుకూల, ప్రతికూల శక్తుల ప్రభావం వ్యక్తి చుట్టూ ఉన్న విషయాలపై చాలా వరకు ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఒక వ్యక్తి నివసించే లేదా పనిచేసే ప్రదేశంలో ఉన్న వస్తువులు అతని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ ప్రభావం సానుకూలంగానూ లేదా ప్రతికూలంగానూ ఉండవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉన్న వస్తువులు సరైన దిశలో లేకుంటే.. అది వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతికూల ప్రభావాల వల్ల మనిషి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు..  ఇంటి వాస్తును ప్రభావితం చేసే కొన్ని వస్తువుల వలన ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.  ఇంట్లో ఇలాంటి 5 వస్తువులు ఉంటే..  ప్రతికూల శక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాదు ఆ ఇంట్లో నివసించే ప్రతి సభ్యుని జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది.

  1. మురికి
    వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ప్రతికూల శక్తికి అతిపెద్ద మూలం ఇంట్లో వ్యాపించే మురికి. అపరిశుభ్రత ఉన్న ఇంట్లో పేదరికం, వ్యాధులు ప్రబలుతాయి. వేద జ్యోతిషశాస్త్రంలో.. శుక్రుడు అన్ని రకాల భౌతిక సౌకర్యాలను అందించే గ్రహంగా పరిగణించబడుతుంది. ఎవరి జీవితంలో శుక్ర గ్రహం బలంగా ఉంటుందో అతను అన్ని రకాల విలాసాల ఆనందాన్ని పొందుతాడు. శుక్ర గ్రహానికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. కనుక సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇల్లును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
  2. ఇంట్లో పాత పాడైపోయిన వస్తువులు
    చాలా మందికి ఇంట్లో పనికిరాని, చెడిపోయిన వస్తువులను దాచుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తలెత్తుతూనే ఉంటాయి. ఇంట్లో విరిగిన వస్తువులు, పనికిరాని వస్తువుల నుండి ప్రతికూల శక్తి పుడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటే.. వెంటనే వాటిని ఇంటి నుండి తొలగించండి. లేదా పాడైన వస్తువులను బాగు చేయించి వాటిని ఉపయోగించడం మొదలు పెట్టండి. వాస్తు శాస్త్రంలో విరిగిన పాత్రలు, విరిగిన తలుపులు , విరిగిన కిటికీల నుండి ప్రతికూల శక్తి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి.. ఆ ఇంట్లో నివసించే సభ్యులందరూ ఆర్థిక, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  3. వస్తువులను చెల్లాచెదురుగా పడవేయడం వలన 
    వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వస్తువులను ఎక్కడ బడితే అక్కడ పెట్టుకోవడం వలన కూడా వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇంట్లోని గదుల్లో వస్తువులను ఎక్కడ బడితే అక్కడ పెడితే.. వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
  4. ఎండిన మొక్కలు చాలా మంది ఇంటి వద్ద మొక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే వాటి పెంపకం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోరు కొందరు. దీంతో మొక్క ఎండిపోతుంది. వాస్తు శాస్త్రంలో ఎండిన పువ్వులు , మొక్కల నుండి ప్రతికూల శక్తి ఉత్పత్తి అవుతుంది. మీ ఇంట్లో ఏదైనా మొక్క ఎండిపోయి ఉంటే, వెంటనే దానిని తొలగించాలి. ఇళ్లలో ఎండిన లేదా మోడువారిన మొక్కలుంటే.. ఆ ఇంట్లో సభ్యుల మధ్య అసమ్మతి ఏర్పడుతుంది. అంతేకాదు ఇంట్లో ముళ్ల మొక్కను పెంచుకోవడం కూడా వాస్తు శాస్త్రంలో నిషిద్ధం.
  5. సాలిపురుగుల గూళ్లు
    తరచుగా సాలీ గూళ్లు ఇళ్లలో కనిపిస్తాయి. వాస్తు ప్రకారం ఇలా ఇంట్లో స్పైడర్ వెబ్స్ ఉండడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. సాలెపురుగులు ప్రతికూల శక్తికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఇండ్లలో సాలెపురుగులు ఉంటే ఆ ఇంటి సభ్యులకు ఆర్థిక సమస్యలు, మానసిక అలజడులు కలుగుతాయి. కనుక ఇంటి మూలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)