ఈ మేకలను బలిస్తే రక్తం రాదట..!

|

Aug 01, 2020 | 2:27 PM

ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ రోజు జంతువులను బలివ్వడం ఆనవాయితీ. అయితే, వారణాసిలో కొందరు బలిస్తున్న మేకలను చూసిన వారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే..

ఈ మేకలను బలిస్తే రక్తం రాదట..!
Follow us on

బక్రిద్ పవిత్రమైన దినంగా ఇస్లామ్ మతంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన రోజు. ముస్లిం సోదరులు ఈ పండుగను సంపూర్ణ భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. బక్రిద్ పండుగ త్యాగనిరతి, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం, పేదల పట్ల కరుణను సూచిస్తుంది. ఇతరుల పట్ల సోదర భావాన్ని తెలియచేస్తుంది. ఈ పవిత్రమైన రోజును ముస్లిం సోదరులు దానధర్మాలు, సద్భావనలతో ఆచరిస్తారు. అయితే, ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ రోజు జంతువులను బలివ్వడం ఆనవాయితీ.

అయితే, వారణాసిలో కొందరు బలిస్తున్న మేకలను చూసిన వారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే మేకలను కొనలేని వాళ్లంతా…మేక బొమ్మ ఉన్న కేకులను కొని వాటిని కట్ చేస్తున్నారు. వీటి వల్ల మేకను బలిచ్చినట్టు ఉంటుంది. రక్తం లేకుండా, ఖర్చు లేకుండా పండగ ముగించినట్టూ ఉంటుందనేది కొందరి ఆలోచన అంటున్నారు స్థానికులు.

Read More:

తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..

పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది

టీచర్‌కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు

పుట్టినరోజు వేడుకలో విషాదం..ఈతకెళ్లిన విద్యార్థులు గల్లంతు

పెళ్లి ఇంట విషాదం…మూడో రోజే నవ వధువు ఆత్మహత్య