Utpanna Ekadashi: అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. రుణ విముక్తి కోసం ఉత్పన్న ఏకాదశి ఈ పరిహారాలు చేసి చూడండి..

|

Nov 22, 2024 | 2:32 PM

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిధిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం ద్వారా విష్ణువు,లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని సంతోషకరమైన జీవితం మీ సొంతం అవుతుందని నమ్మకం. అంతేకాదు ఈ ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.

Utpanna Ekadashi: అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. రుణ విముక్తి కోసం ఉత్పన్న ఏకాదశి ఈ పరిహారాలు చేసి చూడండి..
ఎవరి జాతకంలోనైనా బృహస్పతి అనుకూలమైన స్థానంలో ఉంటే.. అది ఆ వ్యక్తి తెలివితేటలను పెంచుతుంది. పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది. వివాహ అవకాశాలను సృష్టిస్తుంది. అంటే జాతకంలో గురు స్థానం బలంగా ఉంటేనే కళ్యాణ యోగం ప్రాప్తిస్తుంది. కనుక జాతకంలో గురు స్థానాని ఎప్పటికప్పుడు చూసుకుంటూ అందుకు తగిన పరిహారాలు చేస్తూ ఉంటే జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
Follow us on

హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి ఉపవాసం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి రోజున పాటిస్తారు. ఈ రోజున నియమ నిష్టలతో శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉత్పన్న ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును పూజించే సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల మనిషి జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వారి సమస్యలన్నీ తొలగిపోతాయి.

హిందూ పంచాంగం ప్రకారం ఉత్పన్న ఏకాదశి ఉపవాసం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి అంటే ఈ ఏడాది మంగళవారం నవంబర్ 26వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 01:01 గంటలకు ప్రారంభమై.. మర్నాడు అంటే నవంబర్ 27వ తేదీ బుధవారం తెల్లవారుజామున 03:47 వరకు ఉండనుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని నవంబర్ 26న మాత్రమే ఆచరిస్తారు.

ఉత్పన్న ఏకాదశి హిందూ మతంలో ముఖ్యమైన ఉపవాసం. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు తీరి డబ్బు కొరత తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రత్యేక చర్యలు చేయండి

  1. ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి పసుపు పువ్వులు సమర్పించాలి. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించండి. తులసిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఉత్పన్న ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు సమర్పించి దీపం వెలిగించాలి. తులసికి మొక్కకు పూజ చేసి పువ్వులు సమర్పించి నైవేద్యం పెట్టండి.
  2. ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల మనస్సు ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుంది. ఒకవేళ పూర్తి ఉపవడం ఉండే శక్తి లేనప్పుడు ఒక పుట తినవచ్చు లేదా పండ్లు తినవచ్చు.
  3. ఈ రోజు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. అవసరమైన వ్యక్తికి ఆహారం, బట్టలు లేదా డబ్బును దానం చేయవచ్చు.
  4. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
  5. శాలిగ్రామాన్ని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. గంగాజలంతో శాలిగ్రామాన్ని శుద్ధి చేసి పసుపు వస్త్రాలు సమర్పించండి.
  6. సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, లక్ష్మీ నారాయణుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.
  7. ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి స్నానపు నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు వ్యక్తిపై ఉంటాయని నమ్ముతారు.
  8. మీరు వృత్తిలో లేదా వ్యాపారంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణువుకు కుంకుమపువ్వుతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.
  9. ఎవరైనా వివాహ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే విష్ణువును పూజించాలి.ఉత్పన్న ఏకాదశి రోజున కుంకుమ, పసుపు లేదా గంధంతో తిలకం దిద్ది. శ్రీ హరికి పసుపు పుష్పాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం జరుగుతుందని విశ్వాసం
  10. అప్పులతో బాధపడుతుంటే రుణ విముక్తి కోసం ఉత్పన్న ఏకాదశి నాడు రావి చెట్టుకు నీరు సమర్పించండి. సాయంత్రం రావి చెట్టు క్రింద దీపం వెలిగించండి. ఈ చర్యలను అనుసరించడం ద్వారా అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు త్వరలో రుణ విముక్తిని పొందుతాడు.
  11. కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర దేశీ నెయ్యితో దీపం వెలిగించి తులసి మొక్కకు హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల జీవితంలో డబ్బు కొరత రాదని.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.