Lucky Temple Coconut: శివుడికి ప్రతిరూపం ఈ కొబ్బరికాయ అంటూ.. రూ.6.50 లక్షలకు కొన్న భక్తుడు.. ఎక్కడంటే..

| Edited By: Janardhan Veluru

Sep 12, 2021 | 8:41 PM

Lucky Temple Coconut: మాములుగా కొబ్బరికాయ ఎంత రేటు ఉంటుంది.. పల్లెల్లో అయితే ఎనిమిది రూపాయలుంటే.. అదే పట్టణాల్లోకి వచ్చే సరికి రూ. 20 నుంచి రూ.30 లకు దొరుకుతుంది. అదే పూజలు, శుభకార్యాల సమయంలో..

Lucky Temple Coconut: శివుడికి ప్రతిరూపం ఈ కొబ్బరికాయ అంటూ.. రూ.6.50 లక్షలకు కొన్న భక్తుడు.. ఎక్కడంటే..
Lucky Temple Coconut
Follow us on

Lucky Temple Coconut: మాములుగా కొబ్బరికాయ ఎంత రేటు ఉంటుంది.. పల్లెల్లో అయితే ఎనిమిది రూపాయలుంటే.. అదే పట్టణాల్లోకి వచ్చే సరికి రూ. 20 నుంచి రూ.30 లకు దొరుకుతుంది. అదే పూజలు, శుభకార్యాల సమయంలో ఇంకొంచెం ఎక్కువ ధర ఉంటుంది. కానీ ఒక కొబ్బరి కాయను లక్షలు పెట్టి మరీ సొంతం చేసుకున్నారు అంటే ఆశ్చర్య పోవడం ఖాయం .. అవును మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితికి గణపతి విగ్రహం చేతిలో లడ్డు పెట్టి.. నవరాత్రులు పూజలను నిర్వహించిన అనంతరం ఆ లడ్డుని వేలం వేస్తారు.. ఈ వినాయకుడి లడ్డు కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటీపడి మరీ లక్షలను పెట్టి మరీ దక్కించుకుంటారు.. ఇది తెలుగు రాష్ట్రాలలోని భక్తులందరికీ తెలిసిందే.. అయితే ఆ రాష్ట్రంలో మాత్రం కొబ్బరికాయను వేలం వేస్తారు.. దీనికోసం భక్తులు పోటాపోటీగా వేలంలో పాల్గొంటారు. వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక లోని బాగల్కోట్ జిల్లా జమఖండి గ్రామంలోని 12 శతాబ్దానికి చెందిన పురాతన మలింగరాయ దేవాలయం ఉంది.  ఆ ఆలయంలో ప్రతి సంవత్సరం కొబ్బరి కాయలను వేలం వేస్తారు.  ఈ ఆలయంలోని కొబ్బరి కాయను దక్కించు కోవడానికి  భారీ సంఖ్యలో భక్తులు వేలంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఆ కొబ్బరికాయను మలింగరాయ దేవుడు శివుడి ప్రతిరూపంగా అక్కడి ప్రజలు భావిస్తారు. దేవుడి సింహాసనంలో ఉంచి పూజలను చేసిన ఈ కొబ్బరికాయను దక్కించు కోవడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. అందుకనే ఈ కొబ్బరి కాయ వేలానికి పెట్టినప్పుడు వేలు ఖర్చు పెట్టి పోటీపడి మరీ సొంతం చేసుకుంటారు.

అయితే ఇప్పటి వరకూ ఈ కొబ్బరికాయ వేలంలో వేల రూపాయలకు సొంతం చేసుకోగా ఈ ఏడాది అందరికీ షాక్ ఇస్తూ.. అక్షరాలా రూ. 6 లక్షల 50 వేలు పెట్టి సొంతం చేసుకున్నాడు. ఇదే విషయంపై ఆలయాధికారులు స్పందిస్తూ.. ఇప్పటి వరకూ ఈ ఆలయంలోని కొబ్బరికాయ వేలం రూ.10 వేలు మాత్రమే ఉండేదని.. అయితే ఈసారి లక్షల్లో పాడారని చెప్పారు.  ఇలా ఆరులక్షల కొబ్బరికాయను తీసుకోవడంపై మేము ఆశ్చర్య పోయినట్లు తెలిపారు. ఈ కొబ్బరికాయ ద్వారా వచ్చిన ఈ ఆరు లక్షల రూపాయలను ఆలయాభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు.  ఇదే విషయంపై కొంతమంది మూఢ నమ్మకం అని అంటారు.. మరికొందరు.. దేవుడి కృపని దక్కించుకున్న అదృష్టవంతులమని భావిస్తారు.

 

Also Read: LIC Aadhaar Shila: మహిళల కోసం ఎల్ఐసీ స్పెషల్ పాలసీ.. రోజుకి రూ.29లతో నాలుగు లక్షలు పొందే అవకాశం..