శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాకు ముందు ఉన్నట్లే దర్శన విధానాలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం టైమ్‌స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కరోనాకు ముందు ఉన్న దివ్యదర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లతో పాటు.. దర్శన టికెట్లు లేని భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా దర్శనాలకు అనుమతించేవారు. కొవిడ్(Corona) కారణంగా 2020 మార్చి నుంచి దర్శన విధానాలను పూర్తిగా మార్చేశారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టేకొద్దీ దర్శనాలను పెంచినప్పటికీ.. కొన్ని విధానాలను మాత్రం పునరుద్ధరించలేదు. ఫలితంగా తిరుపతి(Tirupathi) లో పరిమితంగా జారీ చేస్తున్న సర్వదర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద భారీ రద్దీ ఏర్పడుతోంది. ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు తొలగించడంతో భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో కరోనాకు ముందు అమలు చేసిన విధానాలనే తిరిగి అమలు పరచాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభించడంతో పాటు, దివ్యదర్శన టోకెన్ల జారీ ప్రారంభంపై పునరాలోచన చేస్తోంది. కరోనాకు ముందు దివ్యదర్శనం, సర్వదర్శనం ద్వారా దాదాపు 45 వేల టోకెన్లు జారీ చేసేవారు. అంతే స్థాయిలో ఇప్పుడు జారీ చేయడంతో పాటు తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు.. తిరుమలతో పాటు స్థానిక ఆలయాల్లో రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందించాలని టీటీడీ ఈవో కే.ఎస్య జవహర్ రెడ్డి ఆదేశించారు. వేసవి ముగిసే వరకు ఆలయాలకు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తిరుమలలో టోకెన్ లేకుండా సర్వదర్శనం అమలు చేస్తున్నందువల్ల క్యూ లైన్లు, షెడ్లు, క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు తాగునీరు, ఆహారం, పాలు నిత్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణకట్ట, సిఆర్వో, పీఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. స్థానిక ఆలయాల్లో సైతం భక్తులు ఎక్కువ సమయం దర్శనం కోసం వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఈవో తెలిపారు.
Also Read
Summer Health: వేసవిలో ఈ వ్యాధులు ఎటాక్ అయ్యే ఛాన్స్.. అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం..
Bandi Sanjay: లెక్కలు తెలియకుంటే తెలుసుకో.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
KGF 2: జక్కన్న ఆర్ఆర్ఆర్ టార్గెట్‌ను చేసిన కేజీఎఫ్.. ఎట్టకేలకు రికార్డ్ క్రాస్ చేసిందిగా..