Tirumala: అంచనాలు తప్పడంతోనే తోపులాట.. దేవున్నీ రాజకీయాల్లోకి లాగుతున్నారన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

|

Apr 15, 2022 | 8:59 PM

Tirumala: మూడు రోజుల క్రితం తిరుపతి లో జరిగిన తోపులాటపై చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) స్పందించారు. టీటీడీ(TTD) విజిలెన్స్‌, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే..

Tirumala: అంచనాలు తప్పడంతోనే తోపులాట.. దేవున్నీ రాజకీయాల్లోకి లాగుతున్నారన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి
Ttd Chairman Yv Subba Reddy
Follow us on

Tirumala: మూడు రోజుల క్రితం తిరుపతి లో జరిగిన తోపులాటపై చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) స్పందించారు. టీటీడీ(TTD) విజిలెన్స్‌, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చర్యలు చేపట్టామన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం, దానికి వంత పాడుతూ దేవున్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతి లో కొంత మేరకు తోపులాట జరిగినా దేవుడి దయవల్ల ఎవరికీ ప్రాణా పాయం జరగలేదన్నారు. సంఘటన జరిగిన గంటలోపే భక్తులకు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని సుబ్బారెడ్డి తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచి సర్వదర్శనానికి అనుమతించి పరిస్థితి అదుపులోకి తెచ్చామన్నారు. ఈ సంఘటన పై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులు భక్తుల్లో భయాందోళనలు కల్పించే కుట్ర చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు అన్నీ చూస్తున్నారని, భక్తులు ఇలాంటి వాటిని నమ్మే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.

టీడీపీ పాలనలో తిరుమల లో ఇలాంటి సంఘటనలు జరగలేదా ? భక్తులు కంపార్ట్ మెంట్ల గేట్లు విరిచిన సంఘటనలు గుర్తు లేవా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో సామాన్య భక్తులకు సంతృప్తి కర దర్శనం చేయిస్తుంటే, స్వామివారి ని భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆరోపణలు చేయడం దురదృష్టకరని అన్నారు. తిరుమలలో క్యూ లైన్లలో ఉండే భక్తులకు పాలు, ఆహారం, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాము. భక్తుల సదుపాయం కోసం తిరుమలలో మరో రెండు అన్న ప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, వీటికి అదనంగా ఇప్పటికే అన్న ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశామని సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుపతి ఎస్వీ గోశాలలో రూ.3కోట్లతో నిర్మించనున్న నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. 8 నెలల్లో ఘీ ప్లాంట్‌ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. పూర్తి విరాళాలతోనే దీన్ని నిర్మిస్తున్నామని.. రోజుకు 60 కిలోల నెయ్యి ఉత్పత్తి చేసేలా కేంద్రాన్ని రూపొందించామన్నారు. వేసవిలో రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేశామని.. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Also Read: Vontimitta: పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. టీటీడీ బంగారు కానుకలు

Nepal Crisis: ఆర్ధిక సంక్షోభం దిశగా మరో పొరుగు దేశం.. డ్రాగన్ కంట్రీ కంత్రీ పనియేనా..!