Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమల్లో భక్తుల రద్దీ.. రెండు రోజులపాటు సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత

|

Apr 10, 2022 | 7:10 AM

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy)ని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి(Tirumala Tirupati) క్షేత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల..

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమల్లో భక్తుల రద్దీ.. రెండు రోజులపాటు సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత
Tirumala
Follow us on

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy)ని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి(Tirumala Tirupati) క్షేత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రెండేళ్ల తర్వాత సర్వదర్శనం పునరుద్ధరించడంతో క్రమంగా స్వామివారిని దర్శించుకునేవారి సంఖ్య పెరిగింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో శనివారం తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం నాటికి దర్శన స్లాట్ లభిస్తోంది. భక్తుల తాకిడి పెరుగడంతో ఆయా కేంద్రాల్లో రెండు రోజుల పాటు టోకెన్ల జారీని నిలిపివేసింది.

మంగళవారం నాటి స్లాట్ పూర్తి కాగానే టోకెన్ల జారీ నిలిపివేసింది. రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం వేయిటింగ్‌ సమయం పెరుగుతుండడంతో టోకెన్ల జారీని తాత్కాలికంగా టీటీడీ నిలిపివేసింది. ఆది, సోమవారాలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లను మళ్లీ మంగళవారం(12వ తేదీన) మధ్యాహ్నం నుంచి భక్తులకు తిరిగి టోకెన్లు జారీ చేయనున్నది. తిరుమలకు పయనమయ్యే శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోలరని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

 

Also Read: Weekly Horoscope: ఈ వారంలో ఈరాశి వారు చేపట్టిందల్లా బంగారమే.. ఈరోజు నుంచి 16వ తేదీవరకూ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..