జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, రాశులకు విశిష్ట స్థానం ఉంది. ఒకే రాశిలో కొన్న గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇలా రాశిలో ఒకటి కంటే రెండు గ్రహాల కలయిక వలన ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంది. ఈ నేపధ్యంలో ఆగస్టు 16న ఒకే రాశిలో బుధుడు శుక్రుడుతో పాటు సూర్యుడు కలవనున్నారు. ఈ మూడు గ్రహాల కలయికకు వేదికగా సూర్యుడు అధిపతి అయిన సింహరాశి కానుంది. దీంతో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఊహించని విధంగా డబ్బులు కలిసి వచ్చి ఆర్ధిక కష్టాలు తీరతాయి. ఈ రోజు జాతకంలో ఏయే రాశికి చెందిన వ్యక్తులకు శుభయోగం ఏర్పడనుందో తెలుసుకుందాం..
ధనస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల 16న ఏర్పడనున్న త్రిగ్రాహి యోగా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీంతో వీరికి ఊహించని విధంగా ఆదాయం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఊహించని విధంగా డబ్బు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో సక్సెస్ అందుకుంటారు. దీంతోపాటు కెరీర్‌కు సంబంధించిన జీవితంలో కొత్త ససంబంధాలు ఏర్పతాయి. ఉద్యోగస్థులకు శుభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో చేపట్టిన పనులలో సక్సెస్ అవుతారు.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ ప్రత్యేక యోగంతో అనకున్న పనులు అనుకున్న విధంగా జరుపుకుంటారు. ఎంతో శుభప్రదంగా ఉండనుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు ఆరోగ్యం పరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. తల్లిదండ్రులకు పిల్లలనుంచి ప్రేమ లభిస్తుంది. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. ఎలాంటి పనులు మొదలు పెట్టినా విజయం మీ సొంతం.
వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ త్రిగ్రాహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్ధిక ఇబ్బండులనుంచి బయటపడతారు. ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు