Tirumala: కరోనా వైరస్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారు కొలువైన ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతిలో కరోనా నిబంధనలను టీటీడీ అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులు తిరుమల కొండపైకి చేరుకోవడానికి ముందే దర్శనం, వసతి ఏర్పాట్లు చేసుకునే విధంగా ఆన్ లైన్ విధానం తీసుకొచ్చారు. అయితే తాజాగా కోనేటిరాయుడు దర్శనానికి వెళ్లిన శ్రీవారి భక్తులు తిరుమల కొండపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె గదుల కోసం నానావస్థలు పడుతున్నారు. దీనికి కారణం తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళలన చేయడం అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
తిరుమలలో మలయప్పస్వామికి దర్శించుకోవడానికి వెళ్లిన స్వామివారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు ఎఫ్‌ఎమ్‌ఎస్ సర్వీసెస్ కింద పని చేస్తున్నారు. ఈ కార్మికులు తమను టీటీడీ కార్పొరేషన్‌లో కలపాలంటూ గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు తమ విధులను సైతం బహిష్కరించారు. దీంతో తిరుమలలో పారిశుద్ధ్య పనులకు ఆటంకం ఏర్పడింది. భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిరుమలలో అద్దె గదులను కేటాయించడంతో టీడీపీ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము ఉదయం 6 గంటల నుంచి గదుల కోసం వేచి ఉన్నామని.. ఇప్పటికీ గదులు కేటాయించలేదంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారులను అడిగితె సరైన సమాధానం చెప్పడం లేదంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు కరోనా మరో వైపు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో.. తమ భద్రతపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీలోని పల్లె వెలుగు బస్సులకు సరికొత్త అందాలు.. రంగులు మార్చుకుంటున్న వైనం..