తిరుమల శ్రీవారి ఆస్తులపై మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. ఆయన రిచ్ కాదు.. సూపర్ రిచ్ అని తేలింది. వరల్డ్‌లోనే రిచ్చెస్ట్ గాడ్ మన తిరుమల వేంకటేశ్వరుడు. భక్తుల నుంచి కానుకలు పొందడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తిరుమల శ్రీవారికి వచ్చే కానుకలు కోట్లల్లో ఉంటాయ్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిపై ఆ స్థాయిలో భక్తికి చాటుకుంటారు భక్తులు. దేశ విదేశాల్లో భక్తులను కలిగియున్న తిరుమల శ్రీవారు.. మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం రిచ్చెస్ట్ గాడ్ మాత్రమే కాదు.. సూపర్ రిచ్‌గా తేలింది. ఇండియాలోని ఎన్నో టాప్ కంపెనీస్ కంటే తిరుమల శ్రీవారి ఆస్తుల విలువే ఎక్కువనే సంగతి వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో ఇది బయటపడింది.
తిరుమల వెంకటేశ్వరస్వామి మొత్తం ఆస్తుల విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇది, చాలా పెద్ద కంపెనీల మార్కెట్ వాల్యూ కంటే చాలా ఎక్కువగా లెక్కగట్టారు. విప్రో అండ్ నెస్లే కంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులే ఎక్కువగా తేలింది. ప్రభుత్వరంగ కంపెనీలైన ఓఎన్జీసీ, ఐవోసీ కూడా తిరుమల శ్రీవారి ఆస్తుల ముందు దిగదుడుపే అంటున్నారు నిపుణులు. మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్ని కంపెనీలు మాత్రమే టీటీడీ కంటే ముందున్నాయ్. అల్ట్రాటెక్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, వేదాంత, డీఎల్‌ఎల్ లాంటి కంపెనీస్ సైతం తిరుమల శ్రీవారి ఆస్తుల కంటే వెనకబడే ఉన్నాయ్.
టీటీడీ ప్రకటించిన లెక్కల ప్రకారం తిరుమల శ్రీవారికి 10.25 టన్నుల గోల్డ్ డిపాజిట్స్, 2.5 టన్నుల గోల్డ్ ఆర్నమెంట్స్, 16వేల కోట్లకు పైగా క్యాష్ డిపాజిట్స్, దేశవ్యాప్తంగా 960 విలువైన ఆస్తులు ఉన్నాయ్. వీటన్నింటి విలువ రెండున్నర లక్షల కోట్లగా అంచనా వేస్తున్నారు మార్కెట్ అనలిస్టులు. స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం ఈ విలువను లెక్కగట్టారు ఎక్స్‌పర్ట్స్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..