Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈనెల 14 నుంచి 3 రోజులు వార్షిక వసంతోత్సవాలు .. ఆ సేవలను రద్దు చేసిన టీటీడీ

|

Apr 11, 2022 | 5:52 PM

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమల ఆలయంలో ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలని(Vasantothsavam) నిర్వహించనున్నారు. ఈ  వసంతోత్సవాన్ని పురస్కరించుకొని..

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈనెల 14 నుంచి 3 రోజులు వార్షిక వసంతోత్సవాలు .. ఆ సేవలను రద్దు చేసిన టీటీడీ
Srivari Annual Vasanthotsav
Follow us on

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమల ఆలయంలో ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలని(Vasantothsavam) నిర్వహించనున్నారు. ఈ  వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మూడు రోజులు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవ‌ను టీటీడీ(TTD) రద్దు చేసింది. వీటిని శ్రీవారి భక్తులు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా టీటీడీ సూచించింది.

వార్షిక సాలకట్ల వసంతోత్సవాలను అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 14వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తైన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

రెండవరోజు ఏప్రిల్ 15న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 9 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 16న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించతో పాటు.. వివిధ ఫలాలను తెచ్చి స్వామికి నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

Also Read: TTD News: అన్నమయ్యను టీటీడీ అగౌర పరుస్తోందని ప్రచారం.. స్పందించిన అడిషనల్ ఈఓ..