ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారి ఆర్థిక, ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. వాస్తు నిపుణులు కూడా ఈ విషయాన్ని నొక్కి చెబుతుంటారు. ఇంట్లో ఉండే వస్తువులు, అవి ఉన్న దిశ ఇంట్లో వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతుంటారు. ఇక దంపతుల మధ్య నిత్యం గిల్లి కజ్జాలకు ఇంట్లో ఉండే వస్తువులు ప్రభావం చూపుతాయని మీకు తెలుసా.? చైనాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చరల్ సిద్ధాంతం ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కపుల్స్ మధ్య గొడవలు దూరమై సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే..
* దంపతుల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరగాలంటే బెడ్ రూమ్‌లో రెడ్ రోజేస్‌ను ఉంచాలని చెబుతున్నారు. వీటివల్ల కపుల్స్ మధ్య బంధం బలపడుతుందని చెబుతున్నారు. ఒకవేళ పువ్వులు లేకపోతే కనీసం గులాబీ పువ్వు పెయింటింగ్‌ను ఉంచాలని చెబుతున్నారు.
* దంపతుల మధ్య విభేదాలు ఉంటే ఇంట్లో పక్షుల పోస్టర్‌లను ఏర్పాటు చేసుకోవాలని షెంగ్ షుయ్ సిద్ధాంతం చెబుతోంది. మరీ ముఖ్యంగా బెడ్ రూమ్‌లో లవ్ బర్డ్స్ ఫొటోను ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
* వైవాహిక జీవితంలో కలకాలం ఆనందం కొనసాగాలనుకుంటే బెడ్‌రూమ్‌లో డాల్ఫిన్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. డాల్ఫిన్ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉండే ఫొటోను ఏర్పాటు చేసుకుంటే వైవాహిక జీవితంలో ఆనందాన్ని తెస్తుందని చెబుతారు.
* ఫెంగ్ షుయ్ సిద్ధాంతం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఇంట్లో గోడలపై వైట్ హార్స్ చిత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. గుర్రం పురోగతికి చిహ్నంగా భావిస్తారు.
* భాగస్వామితో మంచి సంబంధం కొనసాగాలంటే బెడ్ రూమ్‌లో మీ పాట్నర్‌తో దిగిన ఫొటోను ఏర్పాటు చేసుకోండి. ఈ ఫొటోలో మీరిద్దరూ నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి దంపతుల మధ్య గోడవలు తగ్గిపోతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..